ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ మామూలోడు కాద‌ప్పా

అధికారం, మ‌తం, శృంగారం, ఆధ్యాత్మికం, నేరం , రాజ‌కీయం క‌ల‌గలిసి పోయిన చోట న్యాయం కోసం ఎదురు చూడ‌టం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కిన‌ట్లు ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించి , మ‌తం అనే ముసుగు తొడిగి విచ్చ‌ల‌విడిగా దోపిడీకి పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. ఇందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాదు. ఈ దేశానికి మూల స్తంభంగా ఉన్న న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఈ జాడ్యం సోకింది. దీని గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. స్కాంలు, సెక్స్ కుంభ‌కోణాలు, ఆశ్ర‌మాలు, మ‌ఠాలు, పీఠాధిప‌తులు, స్వామీజీలు, లీల‌ల గురించి చెప్పాలంటే క‌నీసం మ‌హా భార‌తం అంత అవుతుంది. మ‌నుషుల్లోని బ‌ల‌హీన‌త‌లు , భ‌యాందోళ‌న‌లే మోసాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఇక అధికారంలో ఉంటే ఏమైనా చేసేయొచ్చ‌న్న ధీమా ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తోంది. నేర‌స్తులే ప్ర‌జా ప్ర‌తినిధులుగా చెలామ‌ణి కావ‌డం ప్ర‌జాస్వామ్యానికి ముప్పుగా ప‌రిణ‌మించింది. ప్ర‌స్తుతం మ‌ర్కెట్ ను సెక్స్ రాజ్యం ఏలుతుంటే మ‌తం ఆధిప‌త్యాన్ని ప్ర‌దర్శిస్తోంది. ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ మార్కెట్ లో సెక్స్ వ్యాపారం అత్య‌ధిక వాటాను క‌లిగి ఉంది. ఏడాదికి వేల కోట్ల‌ను దాటేసింది.

టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చాక సెక్స్ కొంత పుంత‌లు తొక్కుతోంది. అత్యాచారాల కేసులు మ‌రింత పెరిగాయి. దీనికి విచ్చ‌ల‌విడిగా ల‌భించే డేటా కూడా కార‌ణం. ఈ త‌రుణంలో సెక్స్ స్కాండ‌ల్స్ ఒక్క‌టొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా క‌ర్ణాట‌క‌కు చెందిన జేడీఎస్ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ చ‌ట్టం చేతికి చిక్కాడు. ఆయ‌న ఎవ‌రో కాదు ప్ర‌జ‌లు ఎన్నుకున్న పార్ల‌మెంట్ స‌భ్యుడు. త‌ను త‌ప్పు చేయ‌లేద‌ని, త‌ప్పించు కోవాల‌ని చూశాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌ను కాపాడుకుంటూ వ‌చ్చింది ఎవ‌రో కాదు కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్. త‌ను శాడిస్ట్ అని, ఒక్క‌రు కాదు వంద‌లాది మంది మ‌హిళ‌లు బాధితులుగా ఉన్నార‌ని, బ‌య‌ట‌కు చెప్పుకోలేక పోతున్నార‌ని సాక్షాత్తు బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత ఒక‌రు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినా ప‌ట్టించు కోలేదు. ఎందుకంటే బీజేపీని రిమోట్ కంట్రోల్ చేసే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు క‌ర్ణాట‌క‌కు చెందిన బీఎల్ సంతోష్. త‌న అనుమ‌తి లేనిదే ఎవ‌రిపైనా చ‌ర్య తీసుకునే సాహ‌సం చేయ‌రంటే ఆయ‌న ఎంత ప‌వ‌ర్ ఫులో అర్థం చేసుకోవాలి.

మ‌రి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ మామూలోడు కాదు. త‌న‌కు బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. అంత‌కు మించి రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. త‌న తాత హెచ్ డీ దేవ‌గౌడ మాజీ ప్ర‌ధాన‌మంత్రి. పీఎం మోదీకి స‌న్నిహితుడు. త‌న బాబాయి హెచ్ డీ కుమార స్వామి మాజీ సీఎం, ప్ర‌స్తుతం కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఉన్నాడు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ కు సంబంధించి సెక్స్ స్కాం వెలుగు చూసింది. త‌ను విమ‌నైజ‌ర్ మాత్ర‌మే కాదు..శాడిస్టు కూడా. త‌న పెన్ డ్రైవ్ లో వేలాది వీడియోలు నిక్షిప్తం అయి ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దేశానికి సంబంధించి దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ లో స‌భ్యుడిగా ఉన్న ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ చేసిన ప‌ని ఏమిటంటే ప్ర‌జ‌ల కోసం త‌న గొంతు విప్ప‌లేదు. కానీ త‌న కామ కోరిక‌ల‌ను తీర్చుకునేందుకు ఎంద‌రో అమాయ‌కులైన మ‌హిళ‌ల‌ను చెర బ‌ట్టాడు. బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీని వెనుక మ‌ద్ద‌తుగా నిలిచింది ఎవ‌రో కాదు మొన్న‌టి దాకా క‌ర్ణాట‌క‌ను ఏలిన బీజేపీనే.

ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిందో సీన్ మారింది. వ‌రుస‌కు అక్క అయినా ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ వ‌ద‌ల‌లేదు. త‌న‌ను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. వీడియోలో బంధించాడు. త‌న రూమే ఓ స్టూడియోగా మార్చేశాడు. ఫోన్ కెమెరా ఆన్ చేయ‌డం, లైంగిక కార్య‌క‌లాపాల‌ను చిత్రీక‌రించ‌డం చేశాడు. ఇదే త‌న ప‌ని. ఓ వైపు అధికారిక ద‌ర్పం, ఇంకో వైపు ప్రోటోకాల్, మరో వైపు రాజ‌కీయ అండ‌దండ‌లు..ఇవ‌న్నీ త‌న వెనుకాల ఉండ‌డంతో ఆట‌లు సాగాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండ‌దు. ఆ విష‌యం రేవ‌ణ్ణ‌కు బాగా తెలుసు. త‌న‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించాడు. కేసుల నుంచి త‌ప్పించు కోవాల‌ని చూశాడు. కానీ వంద‌లాది మంది బాధితులు ఉన్నా బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోయారు. కానీ ఎవ‌రైనా త‌న బంధువును కూడా వ‌ద‌ల లేదో త‌నే బ‌య‌ట‌కు వ‌చ్చింది. చ‌ని పోయినా ప‌ర్వాలేదు. కానీ ఈ కామాంధుడి నుండి మ‌రొక‌రు బ‌లి కాకూడ‌ద‌ని అస‌లు వాస్త‌వాన్ని బ‌య‌ట పెట్టింది. దీంతో మ‌నోడు ఎంపీ ప‌ద‌వికి ఉన్న వెసులుబాటుతో ఇండియాను వ‌దిలి పారి పోయాడు.

దీనికి అమిత్ షా స‌పోర్ట్ కూడా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో త‌మ ప‌రువు పోతుంద‌ని గ‌మ‌నించిన మాజీ పీఎం దేవెగౌడ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. జేడీఎస్ నుంచి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. స్వ‌దేశానికి రావాల‌ని కోరాడు. త‌న‌పై లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేయ‌డంతో గ‌త్యంత‌రం లేక కాలు మోపాడు. ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న పెన్ డ్రైవ్ లో 2,800 కు పైగా వీడియోలు ఉన్న‌ట్లు గుర్తించారు. కోర్టులో హాజ‌రు ప‌రిచారు రేవ‌ణ్ణ‌ను. సుదీర్ఘ విచార‌ణ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ బ్లాక్ మెయిల్ కు , అత్యాచారానికి పాల్ప‌డ‌డం, హింసాత్మ‌కంగా , నేర ప్ర‌వృత్తిని క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించింది. బాధితురాలికి రూ. 7 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఆదేశించింది. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ చారిత్రాత్మ‌క తీర్పు చెప్పింది. ఈ తీర్పు పై ప‌లువురు బాధితురాళ్లు మండిప‌డుతున్నారు. త‌న‌కు ఉరి శిక్షే స‌రైన శిక్ష అంటున్నారు. వాళ్లు కోరుకున్న దాంట్లో త‌ప్పేముంది క‌దూ..

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *