
ప్రపంచ మార్కెట్ లో ఇప్పుడు ఇండియా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ గత కొంత కాలం నుంచి ఒలింపిక్స్ జపం చేస్తోంది. దీనికి కారణం లేక పోలేదు. తమ దేశం ఎలాంటి పోటీలనైనా నిర్వహించే సత్తా తమకు ఉందని ఇప్పటికకే ప్రకటించారు. ఈ సందర్బంగా తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపిస్తామని , ఈ అవకాశం కోసం తాము ఎంత దాకైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. విచిత్రం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీలో కాదు అహ్మదాబాద్ ను కేరాఫ్ గా మార్చాలని నిర్ణయించింది. 236 ఎకరాలలలో కొలువు తీరిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంను నిర్మించారు. దీని కోసం వందల కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్బంగా ఇప్పటికే దీనిపై చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ పోటీలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మోదీని కాదని, ఆయన పరివారాన్ని తట్టుకుని నిలబడే సత్తా ఉందా. అంటే లేదని చెప్పక తప్పదు.
ఇప్పటికే లక్ష మందికి పైగా సీటింగ్ కెపాసిటీ కలిగిన చరిత్ర అహ్మదాబాద్ మోదీ స్టేడియంకు ఉంది. మోదీ పట్టుదలతో ఉన్నారు. అహ్మదాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఒలింపిక్స్ పోటీలకు నిధులు కూడా కేటాయించింది. ఒలింపిక్స్ పోటీలకు సిద్దమవుతోంది. వచ్చే 2036లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తులు మొదలయ్యాయి. ఒక్క దరఖాస్తు ధర రూ. 5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. భారీ ఎత్తున లాబీయింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 156కి పైగా దేశాలు పోటీ పడుతున్నాయి. వీరందరిని మ్యానేజ్ చేయగలిగే సత్తా కావాలి. అంటే దాదాపు వందల కోట్లు చేయాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ పోటీలను దక్కించు కోవాలంటే దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. ప్రస్తుతానికి అంచనా వేస్తే లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఖతార్. ఇదే క్రమంలో 1982లో ఆసియా క్రీడా పోటీలను నిర్వహించిన ఘనత భారత దేశానికి దక్కింది.
ఇండియా వరకు వస్తే మొత్తం దేశ బడ్జెట్ లో క్రీడలకు కేటాయించిన బడ్జెట్ కూడా తక్కువే. ఒలింపిక్స్ పోటీలలో భారత దేశం స్థానం ఎక్కడుందో తెలుసుకుంటే సిగ్గు పడాల్సిన పరిస్థితి. అత్యంత తక్కవ పతకాలను పొందిన చరిత్ర మనది. ఒలింపిక్స్ కోసం తాము సిద్దంగా ఉన్నామని, తమకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి పెట్టామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఇందులో ఒలింపిక్స్ 2036లో పోటీ పడేందుకు లేదా బిడ్ వేసేందుకు రూ. 1000 కోట్లు ఖర్చు చేసేందుకు తీర్మానం చేసింది. ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒలింపిక్స్ పోటీలకు పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. అరబ్ దేశాలతో పాటు అగ్ర దేశాలు సైతం ఫోకస్ పెట్టనున్నాయి. ఆశించడం మంచిదే కానీ మరీ ఇంత ఆశ పనికి రాదంటున్నారు క్రీడా రంగ నిపుణులు. ఇండియా అంటేనే వ్యాపార, వాణిజ్య, క్రీడా పరంగా అహ్మదాబాద్ ను కేరాఫ్ గా మార్చే ప్రయత్నం మోదీ కొలువు తీరిన 2014 సంవత్సరం నుంచి ప్రారంభమైంది.
దీని వెనుక బడా బాబుల మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఒలింపిక్స్ పోటీలు నిర్వహించాలంటే మాటలా. కానేకాదు..అది అనితర సాధ్యంతో కూడుకున్న పని. వాస్తవానికి కేంద్రం కేవలం నిర్వహణ కోసం రూ. 64,000 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని అంటోంది. ఇది పూర్తిగా సత్య దూరం. ఒకవేళ లాబీయింగ్ చేసి దక్కించుకున్నా నిర్వహణ ఖర్చు రూ. 2,00,000 కోట్లు. గత ఏడాది పారిస్ లో నిర్వహించిన ఒలింపిక్స్ కు రూ. 32,765 కోట్లు ఖర్చు అయినట్లు ప్రాథమిక అంచనా. ఇక ఒలింపిక్స్ పోటీలకు బిడ్ వేసేందుకు చివరి తేది ఆగస్టు 31. దీంతో హుటా హుటిన తీర్మానం చేయడం, ఐఓసీ బిడ్ వేసే పనిలో మునిగి పోయింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా ఒక ఉద్దేశ పర్వకమైన లేఖను పంపింది. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ సమావేశమైంది.
అహ్మదాబాద్ 2036 ఒలింపిక్స్ కు సిద్దమై ఉందని ప్రకటించింది. ఒలింపిక్స్ పోటీల నిర్వహణకు రెడీ అంటూ డిక్లేర్ చేసింది. ఇదే విషయాన్ని బిడ్ లో పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒలింపిక్స్ 2036 కోసం తుది బ్లూ ప్రింట్ ను తయారు చేసింది. ఇందులో గుజరాత్ , భోపాల్, గోవా, ముంబై , పూణేలలో నిర్వహిస్తామని పేర్కొంది. కాగా ఇటీవల కొత్తగా ఎన్నికైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం చేస్తున్న ప్రయత్నం తమ దృష్టికి వచ్చిందన్నారు. జూన్ 23న ఐఓసీ అధ్యక్షుడు బాచ్ పదవీ విరమణ చేసే ముందు భారత దేశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఖతార్, సౌదీ అరేబియా తో పాటు 10కి పైగా దేశాలు ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ లో పాల్గొంటున్నాయి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పణతో భారత దేశం ఇన్ ఫార్మల్ డైలాగ్ నుండి కంటిన్యూయస్ డైలాగ్ దశకు చేరుకుంది. బిడ్ కు సంబంధించి చివరి దశ టార్గెటెడ్ డైలాగ్ . దీని కోసం స్పెసిఫిక్ ఫార్మల్ బిడ్ ను సమర్పించాల్సి ఉంటుంది.
ఎవరికి ఇవ్వాలనే దానిపై ఫ్యూచర్డ్ కమిషన్ అంచనా వేస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, స్టేడియంల నిర్మాణం, క్రీడాకారులకు వసతి సౌకర్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ పోటీల నిర్వహణ కోసం కేవలం భద్రతకే భారీగా ఖర్చవుతుంది. స్పాన్సర్లు, బ్రాండ్ ఇమేజ్ , కంపెనీల వ్యాపార ప్రచారం , తదితర వాటన్నింటి ద్వారా ఆదాయం సమకూరే ఛాన్స్ ఉంది. ఆపరేషనల్ , గేమ్స్ నడిపేందుకే ఏకంగా రూ. 41,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మౌలిక వసతుల కల్పనకు రూ. 22,000 కోట్లు ఖర్చవుతాయి. ఇదిలా ఉండగా 2028 లో లాస్ ఏంజిలీస్ లో నిర్వహించే పోటీలకు రూ. 57,000 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. ఐఓసీ నుంచి ఆతిథ్య నగరానికి 1.8 బిలియన్ల వరకు కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. ప్రసార హక్కులు, స్పాన్సనర్ షిప్ లు, టికెట్ల విక్రయం, తదితర వాటి ద్వారా కొద్ది మేర ఆదాయం సమకూరనుంది. ఇక ఇండియా విషయానిక వస్తే ప్రాథమిక అంచనా రూ. 64 వేల కోట్లు ఉంటే రాబోయే 2036లో జరగే ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఈ అంచనా పెద్ద ఎత్తున తప్పే ప్రమాదం ఉంది. ఇది దాదాపు లక్షన్నర నుంచి రూ. 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. మరి ఇన్ని లక్షల కోట్లను కేంద్రం ఎలా భరిస్తుందని మోదీకే తెలియాలి. ఇకనైనా ఈ పోటీల నిర్వహణ విషయంపై పునరాలోచించుకుంటే మంచిది.