పురుగు మందుల‌ మాఫియా రైత‌న్న‌ల ఫోబియా

మ‌నం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బ‌హిరంగంగానే వీటిని విక్ర‌యిస్తున్నారు. వీటి వెనుక బ‌డా కంపెనీల హ‌స్తం దాగి ఉంది. ప్ర‌జ‌లు రోగాల బారిన ప‌డుతున్నారు. ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌డుతున్నారు. మందుల బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్ర‌ధాన ఆదాయ , జీవ‌న వ‌న‌రుగా మారిన వ్య‌వ‌సాయ రంగం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక ఆహార పంటల ఉత్పత్తిలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తీవ్రరూపం దాల్చింది. అవి లేకుండా దిగుబడులు రాని పరిస్థితి నెల‌కొంది. ఆరోగ్యం కంటే దిగుబ‌డే ల‌క్ష్యంగా సాగు కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో భారీగా వినియోగం పెరుగుతుండ‌డం మందుల కంపెనీల‌కు కాసులు కురిపిస్తున్నాయి. లాభాలు గ‌డించేలా చేస్తున్నాయి. ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌న‌, పురుగు మందుల కంపెనీలు భార‌త్ తో పాటు ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్నాయి శ‌ర‌వేగంగా.

విచిత్రం ఏమిటంటే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఒక్క 2019లో పురుగు మందుల వాడ‌కం 4.19 బిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకోవడం ప్ర‌మాదాన్ని సూచిస్తుంది. అంటే ఒక హెక్టార్ కు 2.70 కిలో గ్రాములు వాడార‌న్న‌మాట‌. ఎరువులు, పురుగు మందుల‌ను అత్య‌ధికంగా వినియోగించేది మ‌న‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఇండియా, యుఎస్ లో 1952 మందుల త‌యారీ ప్రారంభ‌మైంది. 1958లో 5 వేల మెట్రిక్ ట‌న్నుల మందుల త‌యారు కాగా 1990లో 145 పురుగు మందుల న‌మోదు కార‌ణంగా 85 వేల‌ల ట‌న్నుల‌కు పెరిగింది. ఏడాదికి 90 వేల ట‌న్నుల‌కు పైగా ఉత్ప‌త్తి చేస్తూ ఆసియా టాప్ లో కొన‌సాగుతోంది.
ఒక్క వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన భార‌తీయులు 100 కోట్ల‌కు పైగా ఉపాధి పొందుతున్నారు. పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఎరువుల వినియోగం పెరిగింది. గ‌త్యంత‌రం లేక వీటిని వాడుతున్నారు. రైతుల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రాగా చేసుకుని మందుల త‌యారీదారులు మాఫియాగా ఏర్ప‌డ్డారు.

మొద‌ట్లో పంట‌ల సాగుకు సంబంధించి తెగుళ్ల నివార‌ణ‌కు సాంప్ర‌దాయ ప‌ద్ద‌త‌లైన బూడిద‌, వేప పిండి, వేప ప‌స‌రు వాడారు. ఆ త‌ర్వాత డీడీటిని ఉప‌యోగించారు. 1966లో స‌స్య విప్ల‌వం ప్ర‌క‌టించారు. అధిక దిగుబ‌డుల కోసం హైబ్రిడ్ విత్త‌నాలు దిగుమ‌తి చేసుకున్నారు. వీటి కార‌ణంగా మ‌రిన్ని తెగుళ్లు రావ‌డం మొద‌ల‌య్యాయి. వీటి నివార‌ణ కోసం ఆయా దేశాలే తిరిగి ఇండియాకు మందుల‌ను పంపించాయి.
2015-22లో 1000 వేల మెట్రిక్ ట‌న్నుల మందుల‌ను వాడారు. 2022లో 229 వేల మెట్రిక్ ట‌న్నుల మందులు ఉప‌యోగించారు. మొత్తంగా 40 వేల మెట్రిక్ ట‌న్నుల‌ను వాడ‌డం విస్తు పోయేలా చేసింది. మందుల త‌యారీలో మాలిక్యూల్స్ త‌యారు చేసే కంపెనీలు 80కి పైగా ఉండ‌గా తుది ఉత్పాద‌న రూపొందించే కంపెనీలు 2 వేల‌కు పైగా ఉన్న‌ట్లు అంచ‌నా. వీటి త‌యారీకి ముడి స‌రుకును విదేశాల నుండి దిగుమ‌తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తి ఏటా పురుగు మందుల వ్యాపారం రూ. 18 వేల కోట్ల‌కు పైగానే జ‌రుగుతోంది. దీనిపై ఆధార‌ప‌డి 50 ల‌క్ష‌ల మంది బ‌తుకుతున్నారు. మోదీ స‌ర్కార్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లును తీసుకు వ‌చ్చినా అది బ‌డా వ్యాపారుల‌కు, కంపెనీల‌కు మేలు చేకూర్చేలా చేసింది త‌ప్పా రైతుల‌కు ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏమీ లేకుండా పోయింది.

1968 యాక్టు ప్ర‌కారం సెక్ష‌న్ 9 (4) కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కానీ ఎలాంటి న‌మోదు లేకుండానే ప‌లు విదేశీ కంపెనీలు 127 ర‌కాల మందుల‌ను , ఎరువుల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు అంచ‌నా. వీటి వ్యాపారం ఏకంగా రూ. 7 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని స‌మాచారం. మందుల విక్ర‌యంలో సింజెంటా టాప్ లో కొన‌సాగుతోంది. బేయర్స్ క్రాప్ రెండ‌వ స్తానంలో ఉంది. మోన్ శాంటోను బేయ‌ర్ కొనుగోలు చేసింది. ఇవి త‌యారు చేసే కంపెనీల మందుల మూలంగా ఈ నీరంతా చెరువులు, కాలువ‌లు, స‌ర‌సుల్లోకి ప్ర‌వ‌హించి నీటిని క‌లుషితం చేస్తాయి. దీని కార‌ణంగా జీవ‌రాశులు చ‌ని పోతాయి. పెద్ద చేప‌లు పెద్ద ఎత్తున చ‌ని పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పురుగు మందుల వినియోగ‌మేన‌ని స‌ర్వేలో తేలింది. ఈ మందుల‌ను పంట‌ల‌పై పిచికారిపై చ‌ల్ల‌డం వ‌ల్ల ఆహార ఉత్ప‌త్తుల్్లో విషం చేరుతుంది. కూలీలు విష వ‌ల‌యంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. బ‌డా కంపెనీలు ల‌క్ష‌ల కోట్ల ఆర్జిస్తున్నాయి. మందుల ధ‌ర‌లు, పెట్టుబడుల భారం పెరిగి రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల‌లో పురుగు మందుల వ్యాపారం జోరందుకుంది. దానికి అడ్డుకట్ట వేసే వారు లేకుండా పోయారు.

ఈ దారుణ‌మైన మోసాల నుంచి దారుణాల ఊబి నుంచి అన్న‌దాత‌లు బ‌య‌ట ప‌డాలంటే ఒక్క‌టే మార్గం . వాటికి దూరంగా ఉండ‌డం, పురుగు మందులు, ఎరువులను బాయ్ కాట్ చేయడం, పాల‌క ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేకూర్చేలా భ‌రోసా ఇవ్వ‌డం అనేది కావాలి. దీనిని చ‌ట్టంగా తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌త్యేకించి రైతులు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించి పండించే పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాలి. దీనిపై విస్తృత‌మైన ప్ర‌చారం నిర్వ‌హించాలి. మొత్తంగా పురుగు మందులు, ఎరువుల ఉత్ప‌త్తి వేల కోట్ల మెట్రిక్ ట‌న్నుల‌ను దాటి పోగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ్యాపారం కొన‌సాగుతోంది.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *