
143 కోట్ల భారత దేశాన్ని ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని శాసిస్తున్న నరేంద్ర దామోదర దాస్ మోదీపై ప్రతిపక్షాలలో కంటే స్వపక్షంలోనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. బీజేపీకి ఆక్సిజన్ ను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మధ్యన నాగపూర్ లో జరిగిన ఓ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. 75 ఏళ్లు వచ్చాయంటే, శాలువా కప్పుతున్నారంటే ఇక మన కథ ముగిసినట్టే. అంటే అర్థం శేష జీవితం గడపాల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ సంస్థలలో కంటే ఎక్కువగా నరేంద్ర మోదీ పరివారంలో చర్చకు దారి తీసేలా చేసింది. చాయ్ పే చర్చా , గుజరాత్ మోడల్ అంటూ అధికారంలోకి వచ్చింది బీజేపీ 2014లో. ఆనాటి నుంచి నేటి దాకా ప్రధాని పదవి రేసులో ఒకే ఒక్కడు మోదీ తప్పా వేరే పేరు వినిపించిన దాఖలాలు లేవు. ఆ మధ్యన యోగి లేదా అమిత్ షా పేర్లు వినిపించినా అవి ఆదిలోనే ఉండి పోయాయి. కనుమరుగై పోయాయి.
పేరుకే ప్రధాని అయినా నడిపించేదంతా నలుగురే. వారిలో ఒకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాగా, మరొకరు కర్ణాటకకు చెందిన ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన బీఎల్ సంతోష్. మరొకరు భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్. ఈ సమయంలో మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు ప్రధాని మోదీ. దానికి కారణం లేక పోలేదు. వచ్చే సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు జరుపుకో బోతున్నారు. ఆయనకు ఆ తేదీతో 75 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పటికే వయసు అయి పోయిందంటూ తనకు పోటీగా వస్తారని బీజేపీలో సీనియర్ నేతలను చాలా తెలివిగా ఏజ్ పేరుతో పక్కకు తప్పించేలా చేశారు. వారిలో మురళీ మనోహర్ జోషి, ఎల్ కే అద్వానీ, ముప్పవరపు వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్ ఖర్ లు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మోదీ ముందు వెనుకా దరిదాపుల్లో ఎవరూ లేరు..ఆయన ఉన్నంత వరకు ఆ స్పేస్ లోకి వచ్చేందుకు భయపడతారు. అంతలా తనంతకు తాను ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు.
స్వపక్షంలో, విపక్షంలో ఎవరు ఏం మాట్లాడినా లేదా ఏ మాత్రం ఆలోచించినా, ప్లాన్ చేసినా క్షణంలో తెలిసి పోతుంది. అంతటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టే హిందూ సంస్థలతో పాటు బీజేపీ కూడా ఏమీ లేక పోతోంది. 1950 సెప్టెంబర్ 17న పుట్టిన మోదీ ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్ఎస్ఎస్ బాస్ ఇప్పటికే ప్రకటించిన ప్రకారం 75 ఏళ్లు వచ్చాయంటే స్వచ్చందంగా తప్పుకోవడమే మంచిది అని. మరి మోదీకి వర్తిస్తుందా. అంతులేని అధికారాన్ని, దర్పాన్ని, రాచరిక ధోరణిని ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్న ప్రధాని తన సీటును వదులుకుండా అన్నది అనుమానమే. ఇది అప్రకటిత పదవీ విరమణ నియమం ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీసింది. దీనిపై మోదీ గొంతుకగా ఉన్న అమిత్ చంద్ర షా స్పందిచాడు. పార్టీ రాజ్యాంగంలో వయో పరిమితి నియమం ఏదీ లేదని ఒకటికి పది సార్లు స్పష్టం చేశారు. మోదీ వచ్చే ఐదేళ్లు 2029-2034 దాకా కొనసాగుతారని ప్రకటించారు. పవర్ ఫుల్ లీడర్లుగా చెలామణి అవుతున్న సమయంలో నరేంద్ర మోదీనే 75 ఏళ్లకే తప్పుకుంటే బావుంటుందని , పదవీ విరమణ చేస్తే బావుంటుందని ప్రతిపాదించారు.
తనే తీసుకు వచ్చిన ఈ నియమాన్ని తానే ఆచరణలో పెడతారా లేక తుంగలో తొక్కుతారోనని వేచి చూస్తున్నారు అంతా. ఈ సందర్బంగా 75 ఏళ్లకే తప్పు కోవాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. మోదీ దిగి పోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు. గతంలో అద్వానీ, జోషి, జస్వంత్ సింగ్ లకు వర్తించిన పదవీ విరమణ నియమం ప్రధానికి ఎందుకు వర్తించదంటూ నిలదీస్తున్నారు. మోదీ అందరికంటే బలవంతుడని, ఆయనకు ఈ రిటైర్మెంట్ రూల్ వర్తించదంటున్నారు ఆర్ఎస్ఎస్ కీలక నేత దిలీప్ దేవధర్. ఈ పదవీ విరమణ అనేది మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని, బీజేపీకి చెందిన నాయకులకు వర్తించదని పేర్కొన్నారు. కాగా భగవత్ చేసిన సీరియస్ కామెంట్స్ తర్వాత నాగ్ పూర్ కు స్వయంగా వెళ్లారు నరేంద్ర మోదీ. చాలా సేపు చర్చించారు. మొత్తంగా సెప్టెంబర్ వస్తుండడంతో మోదీ ఏం చేస్తారనేది దేశం చూస్తోంది ఆసక్తితో.