చాట్ జిపిటి ఝ‌ల‌క్ టెక్నాల‌జీకి షాక్

ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తోంది టెక్నాల‌జీ. ప్ర‌తి రోజూ కోట్లాది మంది కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. మ‌రికొంద‌రు వాటితోనే గ‌డుపుతూ నిద్ర‌హారాలు మాని చ‌రిత్ర‌కు అంద‌కుండా పోతున్నారు. ప్ర‌తి ఏటా వ‌ర‌ల్డ్ వైడ్ గా అంకురాలు (స్టార్ట‌ప్ లు) రూపు దిద్దుకుంటున్నాయి. కొత్త కొత్త ఊహ‌ల‌కు రెక్క‌లు తొడుగుతున్నారు ఔత్సాహికులు. ఆలోచ‌న‌ల‌కు జీవం పోస్తున్నారు. ఇదంతా నిరంత‌రం కొన‌సాగుతున్న ప్ర‌క్రియ‌. ఒక‌నాడు ఏదైనా స‌మాచారం కావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. అప్ప‌ట్లో ఇంట‌ర్నెట్ ఎక్స్ ప్లోర‌ర్ ను వాడేవాళ్లు. ఆ త‌ర్వాత రీడిఫ్ , యాహూ వ‌చ్చాయి. కానీ వీటిని త‌ల‌ద‌న్నేలా ఊహించ‌ని రీతిలో యావ‌త్ లోకం విస్తు పోయేలా అద్భుతం ఆవిష్కృత‌మైంది. అదే గూగుల్ . ఒక్క సెక‌ను కూడా పూర్తి కాక ముందే స‌మ‌స్త స‌మాచారాన్ని ఎక్క‌డ ఉన్నా మ‌న ముందు ఆవిష్క‌రించింది. దీంతో కోట్లాది మంది దానికి ఫిదా అయ్యారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా వాడే మొబైల్స్ ల‌లో ఎక్కువ‌గా మ‌న భార‌తీయుడైన , టెక్ దిగ్గ‌జం గూగుల్ సిఈఓగా ఉన్న త‌మిళ‌నాడుకు చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆండ్రాయిడ్ టూల్ త‌యారు చేశాడు. ఇదే ఇప్పుడు అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తోంది. మ‌నంద‌రి ముందు అద్భుత‌మైన లోకాన్ని ఆవిష్క‌రిస్తోంది. ఇదే స‌మ‌యంలో నూత‌న ఇన్నోవేష‌న్స్ రూపు దిద్దుకుంటున్నాయి. మ‌రికొన్ని విస్మ‌య ప‌రిచేలా చేస్తున్నాయి.

ఇక ప్ర‌తి రంగంలో ఒడిదుడుకులు ఉన్న‌ట్లే టెక్నాల‌జీ కూడా ఇదే ప‌రిస్థితిని గ‌త కొన్నేళ్లుగా ఎదుర్కోంటోంది. వ‌ర‌ల్డ్ మొత్తం ఇప్పుడు టెక్నాల‌జీతో అనుసంధాన‌మై న‌డుస్తోంది. వ్యాపార‌, వాణిజ్య లావాదేవీల నుంచి మొద‌లుకుని రోజూ వారీ దైనందిన కార్య‌క్ర‌మాల దాకా ప్ర‌తిదీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటోంది. ఇదే స‌మ‌యంలో డిజిట‌ల్ మాధ్య‌మం టాప్ లోకి వ‌చ్చింది. నెట్ క‌నెక్టివిటీ సాంకేతిక‌త‌ను మ‌రింత అనుసంధానం చేసేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే గ‌త కొన్నేళ్లుగా రారాజుగా వెలుగొందుతోంది గూగుల్. ప్ర‌స్తుతం ఈ సంస్థ ద‌రిదాపుల్లోకి రావాలంటే చాలా క‌ష్డ‌ప‌డాల్సి ఉంటుంది. దీనిని ఢీకొట్టేందుకు ఎంతో మంది, ఎన్నో సంస్థ‌లు ప్ర‌య‌త్నం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి.

కానీ గూగుల్ కు ప్ర‌త్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ బింగ్ ను డెవ‌ల‌ప్ చేసింది. కానీ అది కొత్త ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించేందుకు ఏఐ అంటే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీని వాడుతోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున యూజ్ చేయ‌డం మొద‌లు పెడుతున్నారు. ఇదంతా ఓపెన్ ఏఐని వాడుతుండ‌డమే. ప్ర‌స్తుతం దీనిని ఆధారంగా చేసుకుని కొత్త టెక్నాల‌జీ వ‌చ్చింది. అదే చాట్ జిపిటి. ఇది కూడా సెర్చింగ్ ఇంజ‌న్. ఇది ప్రారంభంలోనే ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఏ స‌మాచారం కావాల‌న్నా దానికి వెంట‌నే స‌మాధానం ఇవ్వ‌డం. అవ‌స‌ర‌మైన వాటిని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇది దీని ప్ర‌త్యేక‌త‌. చాట్ జిపిటి అనేది ఒక చాట్ బోట్. దీనిని ఏఐ ఎల్పీ ఫ‌ర్ ఫ్రాఫిట్ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ సంస్థ న‌వంబ‌ర్ 30, 2022లో లాంచ్ చేసింది.

ఈ కంపెనీకి సంబంధించి మాతృ సంస్థ నాన్ ప్రాఫిట్. ఈ సంస్థ‌ను 015లో సామ్ ఆల్ట్మాన్ స్థాపించాడు. ఎలోన్ మ‌స్క్ , ఇత‌రులు క‌లిసి దీనిని స్థాపించారు. 2018లో ఎలోన్ మ‌స్క్ ఈ సంస్థ నుంచి రాజీనామా చేశాడు. కానీ ఇందులో షేర్లు ఉన్నాయి. దీనికి ఉన్న సౌల‌భ్యం ఏమిటంటే మ‌నం ఏమైనా ప్ర‌శ్న‌లు వేస్తే ఒక మ‌నిషి లాగా ఆన్స‌ర్స్ ఇస్తుంది. జీపిటి అనేది ఒక ర‌క‌మైన మెషీన్ లెర్నింగ్ మోడ‌ల్ . ఈ చాట్ బోట్ లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త స‌మాచారాన్ని అప్ డేట్ చేస్తూ ఉంటాయి. క‌చ్చితంగా స‌మాధానం ఇస్తాయి. ఎలాంటి వాటిని అడిగినా ఠ‌క్కున ఆన్స‌ర్ ఇవ్వ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పు త‌ప్పు దొర్లినా వెంట‌నే క‌రెక్టు చేసి ఇస్తుంది. అంతే కాదు యూట్యూబ్ వీడియోల‌కు సంబంధించి స్క్రిప్టు రాయ‌మంటే కూడా రాసి ఇవ్వ‌డం ఇందులో ప్ల‌స్ పాయింట్ .

ఏదైనా అంశానికి సంబంధించి ఆర్టిక‌ల్ రాయ‌మ‌ని అడిగితే వెంట‌నే రాసి ఇస్తుంది. ఇక చాట్ జీపీటీ ఆవిష్క‌రించిన ఐదు రోజుల్లోనే చాట్ బోట్ 1 మిలియ‌న్ యూజ‌ర్ల‌ను పూర్తి చేసుకుంది. ఇది ఓ రికార్డు. ఇక నెట్ ఫ్లిక్స్ ఒక మిలియ‌న్ యూజ‌ర్ల‌ను పూర్తి చేసుకునేందుకు మూడేళ్ల 5 నెల‌లు ప‌డితే, ట్విట్ట‌ర్ కు 25 నెల‌లు, ఫేస్ బుక్ కు 10 నెల‌లు, స్పూటిపై కి 5 నెల‌లు ప‌ట్టింది. కానీ చాట్ జీపీటీకి కేవ‌లం 5 రోజులు ప‌ట్టింది. అంటే అర్థం చేసుకోవ‌చ్చు ఎంత క్రేజ్ ఉందో దీనికి. ప్ర‌స్తుతానికి ఇది చేస్తున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. దీని దెబ్బ‌కు గూగుల్ కూడా ఇబ్బంది ప‌డుతోంది. కానీ దాని ప్ర‌య‌త్నాలు కూడా అది చేస్తోంది. ఇందులో భాగంగా జెమిని ఏఐని తీసుకు వ‌చ్చింది. చాలా టూల్స్ ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. దీనికి ప్ర‌త్యామ్నాయంగా ట్విట్ట‌ర్ సిఇఓ ఎలాన్ మ‌స్క్ గ్రోక్ ను తీసుకు వ‌చ్చాడు. అది కూడా చాట్ జిపిటితో పోటీ ప‌డుతోంది. ఇక‌ రాబోయే రోజుల్లో చాట్ జీపీటీ అనేది గూగుల్ కు ప్ర‌త్యామ్నాయంగా మారే అవ‌కాశాలు లేక పోలేదు. కానీ చాలా స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. టెక్నాల‌జీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఎవ‌రు ఎక్కువ కాలం ఉండ‌రు. నిన్న గూగుల్ రేపు చాట్ జీపీటీ రేపు ఇంకొకటి కావ‌చ్చు. పోటీ స‌హ‌జం. దేని ప్ర‌త్యేక‌త దానిదే. వేచి చూడ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం. ఏది ఏమైనా మాన‌వ జీవితంలో ఈ శ‌తాబ్దంలో అద్భుతం చోటు చేసుకున్న‌ది మాత్రం ఒకే ఒక్క‌టి ..అది చాట్ జీపీటిన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

  • Related Posts

    సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా ర‌వికుమార్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజ‌య‌వాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా మంద‌ల‌పు ర‌వికుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు…

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *