
అక్కడ ఇసుక వేస్తే రాలనంత నిశ్శబ్దం. ఒక అసాధారణమైన వ్యక్తి. ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే మ్యాథ్స్ సబ్జెక్టును అవలీలగా, సూత్రాలను సులభంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేయని ప్రయోగం లేదు. ప్రపంచం అతడి మేధస్సుకు సలాం చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అతడే మహాజన్ మహరాజ్. అందరూ అతడిని మహాన్ ఎంజే అని పిలుస్తారు. ఒక్కసారి చూస్తే చాలు ఆ దివ్యత్వం ..ఆ జ్ఞాన భాండాగారం ..తేజస్సును చూసి మురిసి పోతాం. మైమరిచి పోతాం. అలవోకగా..అద్భుతంగా ..కళ్లకు కట్టినట్టు ..పాఠాలు వల్లె వేస్తారు. ఆధునికమైన లాప్‌టాప్‌లు వాడుతారు. తామే గొప్పవారమని మురిసిపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..కంపెనీలు..కోట్లతో వ్యాపారం చేసే వాళ్లు..అమెరికన్లు తల దించుకునేలా ఎంజే పేరు తీసుకు వచ్చారు.
ప్రతిష్టాత్మకమైన భట్నాగర్ అవార్డు స్వంతం చేసుకున్నారు. అన్ని దేశాల మేధావులను తలదన్ని .. మహరాజ్ ముందు వరుసలో నిలిచారు. ఆయన సీదాసాదా మనిషి. మన ఇంట్లోని మనిషిలా మాట్లాడతారు. గణితంలో..సైన్స్‌లో …టెక్నాలజీలో ఏది అడిగినా చిటికెలో ఆన్సర్ చేస్తారు. ఎంజే ముందు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ ..లో నిమగ్నమయ్యే వేలాది మంది టెక్కీలు అతడిని ఫాలో అవుతున్నారు. ఆయన కార్పొరేట్ కాలేజీల్లో చదువు కోలేదు. రామకృష్ణ మిషన్‌లో చదువుకున్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఇంతకీ ఎవరీ మహాన్ ఎంజే అనుకుంటున్నారా. ప్రపంచాన్ని తన ప్రతిభా పాటవాలతో , అసాధారణమైన గణిత మేధతో విస్తు పోయేలా చేసిన సన్యాసి. అన్నింటినీ త్యజించినా మ్యాథ్స్ పట్ల తన ప్రేమను మాత్రం కోల్పోలేదు.
ఇప్పటికీ ఎలాంటి ప్రాబమ్స్ చెప్పినా క్షణాల్లో ఇట్టే చెప్సేసై నైపుణ్యం ఆయన స్వంతం. ఆయనకు లెక్కకు మించిన అభిమానులు ఉన్నారు. అంతకంటే ఎక్కువగా స్టూడెంట్స్ కూడా. ఆహార్యంలో సైతం భారతీయతను కలిగి ఉన్న మహాన్ ఎంజే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో ఉన్న వారిని గుర్తిస్తాం. వారి గురించి పొగిడేందుకు పోటీ పడతాం. కానీ మన మధ్యనే ఉంటూ గణితంలో టాప్ లెవల్లోకి చేరిన ఇలాంటి వాళ్లను గుర్తించం. ఎందుకంటే విదేశీ వ్యామోహంలో పడి కొట్టుకు చస్తున్నాం గనుక.
నేర్చు కోవడానికి, తెలుసు కోవడానికి సన్యాసం ఏమాత్రం అడ్డంకి కాదంటారు మహాన్ ఎంజే. ఐఐటీ కాన్పూర్ లో చదివాడు. ఎలక్ట్రికట్ ఇంజనీరింగ్ ఎంచుకున్నారు.
మహాన్ మహారాజ్ లేదా స్వామి విద్యానాథనంద అని కూడా పిలుచుకుంటారు. ప్రొఫెసర్ స్థాయికి ఎదిగినా ఇంకా ఒదిగి ఉండేందుకు ఇష్ట పడతారు. 1968లో పుట్టిన మహన్ మిత్రా బర్కిలీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో పీహెచ్ డీ పట్టా పొందాడు. 1998లో రామకృష్ణ మిషన్ లో చేరడంతో ఒక్కసారిగా లైఫ్ స్టైల్ మారి పోయింది. ప్రపాంచిక జీవితాన్ని పక్కన పెట్టాడు..సన్యాసిగా మారాడు. అయినా గణితంలో బోధించడం మాత్రం మానలేదు. నిత్యం జీవితంతా పాఠాలు చెప్పడం, పరిశోధనలు చేయడంతోనే గడిచి పోయింది మహాన్ ఎంజేకు. నేర్చు కోవడానికి సన్యాసం ప్రేరణగా నిలుస్తుందని అడ్డంకి కాదని చెప్పే ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ.