జాక్ మాను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

జాక్ మా మ‌రోసారి ప్ర‌పంచానికి వార్త‌గా మారి పోయాడు. ఎందుకంటే ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా, బిలియ‌నీర్ గా మాత్ర‌మే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తి ప్ర‌పంచ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఇవాళ త‌ను ఎగుడుదిగుడుల‌ను ఎదుర్కొనేందుకు సిద్దమై ఉన్నాడు. అంద‌రూ డ్రాగ‌న్ చైనాకు స‌లాం కొడితే మ‌నోడు ధైర్యంగా ధిక్కార స్వరం వినిపించారు. కింగ్ జిన్ పింగ్ ను ఎదుర్కోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందుకే క‌క్ష క‌ట్టాడు. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాల‌ని చూశాడు. అటు వైపు నుంచి న‌రుక్కుంటూ వ‌చ్చాడు. ఒక ర‌కంగా జాక్ మా రెక్క‌ల్ని క‌త్తిరించాడు.

కానీ జాక్ మాకు తెలుసు .. క‌ష్టం ఏమిటో దాని విలువ ఏమిటో. అందుకే లాభ న‌ష్టాల‌ను సమంగా చూసుకునే ఈ వ్యాపార‌వేత్త‌కు ఎలా పోయిన చోట డ‌బ్బులు సంపాదించాలో స్వావ‌నుభ‌వం. ఆయ‌న సృష్టించిన అలీ బాబా ఒక సంచ‌ల‌నం..పెను ప్ర‌భంజ‌నం. అక్క‌డ త‌న‌ను తోసి వేయాల‌ని చూసిన ప్ర‌ధాన కంపెనీల వ్యూహాలు వ‌ర్క‌వుట్ కాలేదు. అంతెందుకు అమెజాన్ కూడా ఆ సంస్థ ముందు వెల వెల బోయింది. లెక్కించ లేనంత సంప‌ద‌ను సృష్టించాడు జాక్ మా. ఇవాళ ప్రాణ భ‌యంతో ఎక్క‌డో ఒక చోట దాక్కున్నాడ‌ని గోబెల్స్ ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఆయ‌న ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నాడు. ఈ ప్ర‌పంచానికి దూరంగా జీవితాన్ని స్వాగ‌తిస్తున్నాడు.

ఇవాళ జాక్ మాకు మ‌రో షాక్ త‌గిలింది. జాక్ మాతో బ‌ల‌మైన వ్యాపార సంస్థ‌గా పేరొందిన యాంట్ గ్రూప్ తెగ‌దెంపులు చేసుకుంది. దీని వెనుక ఎవ‌రి ఒత్తిళ్లు ఉన్నాయో ఎవ‌రికి ఎరుక‌. ఇవ‌న్నీ వ్యాపారంలో మామూలే. ఆ విష‌యం ముందే తెలుసు జాక్ మాకు . విచిత్రం ఏమిటంటే యాంట్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది ఆయ‌నే కావ‌డం. కానీ త‌న‌ను వ‌ద్ద‌నుకోవ‌డం విడ్డూరంగా లేదు. స‌రిగ్గా రెండేళ్ల కింద‌ట జాక్ మా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆనాటి నుంచి ఆయ‌న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే వ‌చ్చారు.
తానే సంస్థ‌గా మారిన జాక్ మాకు కూడా తెలుసు. ఏదో ఒక‌రోజు ఇలాంటి వార్త వినాల్సి వ‌స్తుంద‌ని. ఆయ‌న అన్నింటికీ సిద్ద‌ప‌డే ఉన్నారు.

అదే అస‌లైన వ్యాపార‌వేత్త ల‌క్ష‌ణం. ఎక్క‌డా సంయ‌మ‌నం కోల్పోకోక పోవ‌డం జాక్ మా ప్ర‌త్యేక‌త‌. చైనాపై క‌న్నెర్ర చేయ‌డంతో గ‌త 12 నెల‌ల్లో ఆయ‌న త‌న సంప‌ద‌ను గ‌ణ‌నీయంగా కోల్పోయారు. కానీ ఈ సంద‌ర్భంగా జాక్ మా చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తి ఒక్క‌రికీ వ‌ర్తిస్తాయి. భ‌విష్య‌త్తులో ఆట ఆవిష్క‌ర‌ణ‌కు సంబంధించిన‌ది. కేవ‌లం నియంత్ర‌ణ నైపుణ్యాలే కాదు..నిన్న‌టి మార్గాల‌తో భ‌విష్య‌త్తును నియంత్రించ లేమ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇలా అనాలంటే ఎంత ధైర్యం కావాలి. ఏది ఏమైనా జిన్ పింగ్ కింగ్ కావ‌చ్చు..కానీ జాక్ మా ఎప్ప‌టికీ రాజు మాత్ర‌మే.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *