
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కవితమ్మనే బతుకమ్మగా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై భారత రాష్ట్ర సమితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర సమితి) బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై బహిష్కరణ వేటు వేశారు. ఇది ఎవరూ ఊహించనిది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా, ఏ స్థానంలో ఉన్నా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. చివరకు తన స్వంత కూతురు అయినప్పటికీ కవితకు ఝలక్ ఇచ్చారు. తను తండ్రికి ముద్దుల కూతురు. తనకకు ఆమెంటే పంచ ప్రాణం. అయినా ఎందుకనో గత కొంత కాలంగా బాహాటంగా పార్టీ గురించి, నిర్ణయాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. తన తండ్రి కేసీఆర్ దేవుడు అని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు పొంచి ఉన్నాయని వాపోయారు. పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోందని, త్వరలోనే బీజేపీలో కలిపేస్తారంటూ బాంబు పేల్చారు కవిత. ఇదే సమయంలో ప్రస్తుత సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. ఇలా తయారు కావడానికి, కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ప్రధాన కారకులు ఆ ఇద్దరే అంటూ ఎంపీ సంతోష్ కుమార్ , మాజీ మంత్రి హరీశ్ రావు అంటూ బహిరంగంగానే ఆరోపించారు కవిత. ఇది తీవ్ర దుమారం రేపింది పార్టీలో. అంతకు ముందు ఆమె ఓ లేఖ రాశారు. తను అమెరికాలో ఉండగానే బయటకు లీక్ అయ్యింది. ఇది తాను రాసిందేనంటూ పేర్కొనడం కలకలం రేపింది.
గత కొంత కాలంగా కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు నెలకొన్నాయని జరుగుతున్న ప్రచారం కవితపై బహిష్కరణ వేటుతో నిజమని తేలి పోయింది. ఓ వైపు అనారోగ్యం, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమతం కావడం, పార్టీలో ఆధిపత్య పోరు చివరకు తనను మరింత బేలగా తయారయ్యేందుకు దోహద పడింది. ఈ తరుణంలో తండ్రికి అండగా ఉండాల్సిన కవిత ఉన్నట్టుండి అసమ్మతి రాగం అందుకోవడం ఒకింత ఇబ్బందికి గురి చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి ప్రమేయం ఏముందో కానీ కేసీఆర్ మాత్రం గుర్రుగా ఉన్నట్లు టాక్. లిక్కర్ స్కాం కేసులో తనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇబ్బంది పెట్టినా, జైలుకు వెళ్లినా ఎవరూ తన కోసం కానీ, పార్టీ పరంగా కానీ మద్దతు ఇవ్వలేదంటూ వాపోయింది ఎమ్మెల్సీ కవిత. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కవిత. సాంస్కృతి పరంగా మహిళలను ఒకే తాటిపైకి తీసుకు రావడంలో బతుకమ్మ ద్వారా కలిపేలా చేసింది. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్లడంలో తను సక్సెస్ అయ్యింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇదే సమయంలో తను తెలంగాణ జాగృతి సంస్థ ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం చేస్తూ వచ్చింది కల్వకుంట్ల కవిత.
ఈ క్రమంలో పార్టీ బలహీన పడేలా తను మాట్లాడటం పట్ల కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బహిష్కరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. పార్టీ రూల్స్ కు విరుద్దంగా మాట్లాడుతున్నారంటూ అందుకే వేటు వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం, పార్టీ బలహీన పడేలా కామెంట్స్ చేయడం తన దృష్టికి వచ్చిందని, ఆమె వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా ఉందని అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు కేసీఆర్. అందుకే సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తనను తొలగించామన్నారు. ఏది ఏమైనా 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన కవితపై వేటు పడడం ఒకింత ఆశ్చర్య పరిచినా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎలా నెట్టుకు రాగలదనేది మిలియన్ డాలర్ ప్రశ్న.