
దక్కించుకున్న బీజేపీ నేత లింగాల దశరథ్ గౌడ్
హైదరాబాద్ : హైదరాబాద్ లో గణనాథుల మహా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రేపు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని హుస్సేన్ సాగర్ లో మరికొన్ని చుట్టు పక్కల చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇక గత కొన్నేళ్లుగా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అతి పెద్ద 72 అడుగులతో కూడిన ఖైరతాబాద్ గణనాథుడు మరోసారి ఆకర్షణగా నిలిచాడు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకుని పూజలు చేశారు.
ఇక దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది రాజేంద్ర నగర్ లోని రిచ్ మండల్ విల్లాలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ ఏకంగా రూ. 2.32 కోట్లకు ధర పలికింది. దీనిని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చేజిక్కించుకున్నారు. మరో వైపు నగరంలో పేరు పొందిన బాలాపూర్ లడ్డు ధర కూడా భారీగానే పలికింది. ఈ సారి కర్మన్ ఘాట్ కు చెందిన భారతీయ జనతా పార్టీ నేత లింగాల దశరథ్ గౌడ్ చేజిక్కించుకుంది. వేలం పాటలో 35 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో తను రూ. 35 లక్షలకు చేజిక్కించు కోవడం విశేషం.
కాగా హైదరాబాద్ సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూకు విశేషమైన ఆదరణ ఉంది. లడ్డూ ప్రసాదం స్వీకరించే వారికి కోరిన మొక్కులు తీరుతాయని.. కుటుంబాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది.. ఈ నేపథ్యంలోనే ప్రతియేటా బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రత్యేకంగా ప్రజలు చూస్తుంటారు.