ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం : జస్టిస్ చంద్ర‌కుమార్

భార‌త రాజ్యాంగానికి పెను ముప్పు ప‌రిణ‌మించింది

హైద‌రాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయ‌మూర్తి చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యంతో పాటు భార‌త రాజ్యాంగం ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తూ తీర్పునిచ్చారని ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి సంఘీభావంగా ఆదివారం సికింద్రాబాద్‌ బోయిగూడలోని నాలెడ్జ్ సెంటర్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బన్నూరు కొండారెడ్డి అధ్యక్షతన న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేకపోవడంతో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా నిస్సత్తువ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని భ్ర‌ష్టు పట్టించడానికి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిలువెత్తు నిదర్శనం 58వ స్థానంలో ఉన్న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనుభాయ్ పంచోలిని ఇటీవల భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారని, సుప్రీంకోర్టు కొలీజియంలోని జస్టిస్ నాగరత్న వ్యతిరేకించినా పట్టించు కోలేదని ఆయన ఆరోపించారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరిపై ఉందని జస్టిస్ చంద్రకుమార్ నొక్కిచెప్పారు. ఇప్పటికైనా గ్రహించి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యతిరేకతకు జరుగుతున్న పోరని, రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం పాటుపడాలని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అడ్వకేట్ల పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. బిఆర్ఎస్ నేతలు ఎరువు బస్తాలు ఇస్తే ఓటేస్తామని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని అనడం హాస్యాస్పదమని, ఎరువు బస్తాలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏమైనా సంబంధముందా అని రెహ్మాన్ ప్రశ్నించారు ? బిఆర్ఎస్ కు ఉన్న ఆ రెండు ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి వేయక పోతే భవిష్యత్తులో బిఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరని రెహ్మాన్ హెచ్చరించారు.

సమావేశంలో కన్వీనర్ బన్నూరు కొండారెడ్డి న్యాయవాదుల తరపున ఎంపీలందరికీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలంటూ “ఈ-మెయిల్స్” పంపిద్దామని తీర్మానం ప్రవేశపెట్టగా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.

న్యాయవాదులతో కిక్కిరిసిన సమావేశ హల్ లో ఏపీసీఎల్సీ నేత సురేష్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ వాగేష్, గోవర్ధన్, సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు, బీవీ శేషగిరి, డా. అశోక్ కుమార్ తదితరులు ప్రసంగించారు.

  • Related Posts

    సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా ర‌వికుమార్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజ‌య‌వాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా మంద‌ల‌పు ర‌వికుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు…

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *