ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

సిఫార‌సుల‌కు నో ఛాన్స్ భ‌క్తుల‌కే ప్ర‌యారిటీ

తిరుమ‌ల : శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల‌లో ఇవాళ మ‌రోసారి ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధ‌వారం మ‌రోసారి ఆయ‌న కొలువు తీరారు. టీటీడీ ఎక్స్ అఫిసియో మెంబ‌ర్ గా కూడా ప్ర‌మాణం చేశారు. అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల్ కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీకి ఈవోగా ప‌ని చేస్తూ బ‌దిలీపై వెళుతున్న జె. శ్యామ‌ల రావు, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మంతో పాటు ఆల‌య ప్ర‌ధాన పూజారులు, అర్చ‌కులు . అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇది స్వామి త‌న‌కు ఇచ్చిన గొప్ప అవ‌కాశం అన్నారు. మ‌రోసారి తాను వ‌స్తాన‌ని అనుకోలేద‌న్నారు. కానీ ఆ దేవ దేవుడు త‌న‌ను క‌రుణించాడ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన ఈవో చాలా సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చార‌ని అన్నారు. సాంకేతికత‌ను ఉప‌యోగించుకునేలా చేస్తామ‌న్నారు. ఇదే క్ర‌మంలో భ‌క్తుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది తలెత్త‌కుండా త‌న వంతుగా ప‌ని చేస్తాన‌ని, ఎలాంటి పైర‌వీల‌కు , సిఫార‌సుల‌కు తావంటూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *