బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం

తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో సీఎం సూచించారన్నారు. అదే విధంగా టిటిడి చైర్మెన్ వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. టిటిడిలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *