
దేశంలోనే తొలిసారిగా మహిళా నాయకురాలు
నేపాల్ : ఎట్టకేలకు నేపాల్ ప్రధానమంత్రిగా సుశీలా కర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో తను దేశ ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. సోషల్ మీడియాపై నిషేధం కారణంగా ఆందోళనలు మిన్నంటాయి. ఓలి శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు. ఇదిలా ఉండగా దేశ అధ్యక్షుడు పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈనెల 12 అర్దరాత్రి నుంచి ఇది వర్తిస్తుందని, ఈ మేరకు తాత్కాలిక పీఎంగా సుశీలా కర్కికి బాధ్యతలు అప్పగించినట్లు దేశ అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది.
అంతే కాకుండా వచ్చే ఏడాది 2026 మార్చి 21న ఎన్నికలు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఖాట్మండులోని అధికారిక నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశానికి చెందిన ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో దేశంలో స్వేచ్ఛకు విలువ ఇవ్వాలని, ఆధిపత్యం చెల్లుబాటు కాదంటూ పేర్కొన్నారు ఆందోళనకారులు. ఇది అరుదైన అవకాశం . దయచేసి దేశానికి మీ నాయకత్వంలో మంచి పేరు తీసుకు రావాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులతో హోరెత్తించారు.