
తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్యక్రమంలో
చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే సర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్. శనివారం ఆయన రాష్ట్రంలోని తిరుచ్చి వేదికగా మీట్ ది మై పీపుల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని రంగాలలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో సీఎం ఎంకే స్టాలిన్ అంకుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు విజయ్. అంతే కాదు తాను నిర్వహించిన బహిరంగ సభకు నానా ఆంక్షలు విధించారని ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని , తమ సత్తా ఏమిటో చూపించారని చెప్పారు.
భద్రతా ఆంక్షలు విధించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిపాలనను ఆయన ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు, రాష్ట్ర చరిత్రలో మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో భద్రతను సాకుగా ఉపయోగించడం కంటే ప్రజా భద్రతను నిర్ధారించే నైతిక బాధ్యతపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా తిరుచ్చిలో కూడా పోలీసులు
కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్. రోడ్‌షోలు, వాహన ఊరేగింపులు లేదా ప్రజా స్వాగత కార్యక్రమాలపై నిషేధం. ప్రచార కాన్వాయ్‌ను ఆరు వాహనాలకు మాత్రమే పరిమితం చేయడం. పార్టీ సభ్యులు కాలి నడకన కవాతు చేయడాన్ని నిషేధించడం విధించడం పట్ల ఫైర్ అయ్యారు విజయ్.