ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచానికి ప‌రిచయం చేసిన ఒకే ఒక్క‌డు దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు. ఆయ‌న తెలుగు జాతికి చేసిన సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఇందులో భాగంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మంత్రి నారాయ‌ణ‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు ముఖ్య‌మంత్రి.
ఇందులో భాగంగా తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మ విశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై ప్ర‌ధానంగా సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచి పోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియ చెప్పేలా ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *