
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు
తిరుపతి : దేశ పురోగతికి మహిళా సాధికారతకు కీలకమని పేర్కొన్నారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. ఆదివారం తిరుపతి వేదికగా జరిఇగన మహిళా సాధికారతపై పార్లమెంటరీ, శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశం సాగుతున్న ప్రయాణంలో మహిళా సాధికారత అంతర్భాగమని పేర్కొన్నారు . మన మహిళలు, విద్యావంతులు, స్వావలంబన కలిగి వారుగా ఉన్నారని అన్నారు. మరింత పురోభివృద్ది దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు స్పీకర్. రాజ్యాంగ సభలోని దాదాపు 15 మంది మహిళా సభ్యులు ప్రపంచంలోని అతి పొడవైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో గణనీయంగా దోహద పడ్డారని ఈ సందర్బంగా ఓం బిర్లా గుర్తు చేసుకున్నారు.
ఫలితంగా భారత రాజ్యాంగం ప్రారంభం నుండే మహిళలకు సమానత్వం, న్యాయం, సార్వత్రిక ఓటు హక్కును హామీ ఇచ్చిందని చెప్పారు . అనేక దేశాలలో మహిళలు తమ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి దశాబ్దాలుగా పోరాడాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో వారి సరైన స్థానాన్ని పొందేందుకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ చట్టాన్ని ఆయన ఉదహరించారు. సమకాలీన ఉదాహరణలను దృష్టిలో ఉంచుకుని గిరిజన నేపథ్యం నుండి వచ్చిన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అని బిర్లా ఎత్తి చూపారు. ఇవాళ మహిళలు రాజకీయాలు, సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, నాయకత్వం, సాయుధ దళాలలో కూడా రాణిస్తున్నారని ప్రశంసించారు.
మహిళల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి అనేక అవకాశాలు సృష్టించడం జరిగిందన్నారు.