మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా ఉన్న స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు, గతంలో ఈ బాధ్యతను ఎన్.వి.ఎస్. రెడ్డి నిర్వ‌హించారు.
ప్రభుత్వం అనేక మంది ఐఏఎస్ అధికారులను కీలక విభాగాలు, ఏజెన్సీలకు బదిలీ చేసింది.
సమర్థవంతమైన పాలనను నిర్ధారించే లక్ష్యంతో చేసిన మార్పులలో సవరించిన ఫంక్షనల్ అదనపు ఛార్జ్ (ఎఫ్‌ఏసీ) ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

ఇతర కీలక నియామకాల్లో స్టడీ లీవ్ నుండి తిరిగి వస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్రుతి ఓజాను మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ గా ఉన్న‌ కృష్ణ ఆదిత్య కు తెలంగాణ గురుకుల, సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా కోట శ్రీవత్స ను HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్) గా నియమితులయ్యారు . అథారిటీ కార్యదర్శి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తార‌ని జారీ చేసిన ఉత్త‌ర్వులలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పేర్కొన్నారు. మొత్తంగా అటు ఇటు బ‌దిలీలు చేయ‌డం త‌ప్పితే పాల‌న‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

  • Related Posts

    నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు.…

    బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *