22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్ర‌క‌టించిన చిత్రం మూవీ మేక‌ర్స్

హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెల‌కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ విడుద‌లైంది. ఈ సినిమా ఆశించిన మేర ఆడ‌లేదు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒకింత నిరాశ క‌లిగించింది. త‌ను ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌క పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని సినీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాజాగా త‌ను న‌టించిన మ‌రో మూవీ ఓజీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, గ్లింప్స్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు సుజిత్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఓ రేంజ్ లో చూపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు పండుగు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా ఓజీ మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఫ్యాన్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. ఈనెల 22న హైద‌రాబాద్ లో చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటీటీకి సంబంధించి భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయింది ఓజీ. దీనిని నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది. ముందుగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంది. నాలుగు వారాల త‌ర్వాత అది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఓజీకి సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 20న విడుద‌ల కానుంద‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య , కళ్యాణ్ దాసరి నిర్మించారు దీనిని. ఓజాస్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించ‌గా గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఇమ్రాన్ హష్మి తెలుగులోకి అడుగు పెడుతున్నాడు, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ న‌టిస్తున్నారు.

  • Related Posts

    ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    న‌టుడు రాహుల్ రామ‌క్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : న‌టుడు, ర‌చ‌యిత రాహుల్ రామ‌కృష్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌ను తాజాగా ఎక్స్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున…

    బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *