
భారత దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక
ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక సినిమాగా ఆస్కార్ 2026 అవార్డు రేసులో నిలిచింది. ఈ విషయాన్ని జ్యూరీ చైర్ పర్సన్ చంద్ర. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సింగపూర్ వేదికగా. ఇదిలా ఉండగా హోమ్ బౌండ్ చిత్రం ఎంపిక కావడంపై స్పందించారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 98వ అకాడమీ పురస్కారాలకు ఇండియా తరపున సెలెక్టు కావడం పట్ల స్పందించారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఫిర్దౌసుల్ హసన్. 14 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది మామూలు విషయం కాదన్నారు.
ఆస్కార్ 2026 అవార్డుల ఎంట్రీకి సంబంధించి జ్యూరీ పరిశీలన నిమిత్తం మొత్తం 24 సినిమాలు అందాయి. వీటిని పరిశీలించి విస్తృతంగా చర్చించారు. చివరకు జాన్వీ కపూర్ కీ రోల్ పోషించిన హోమ్ బౌండ్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు హసన్. ఈ ఒక్క సినిమానే ఆస్కార్ అవార్డుకు అర్హత సాధిస్తుందని ఎంపిక కమిటీ భావించిందన్నారు. సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉందన్నారు. హౌమ్ బౌండ్ అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రం భారతీయతను, సమాజపు పోకడను, ఇక్కడి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. సాంకేతికతతో పాటు నటన, ఎడిటింగ్, సంగీతం, కంటెంట్ ఇతర విషయాలన్నీ కూడా హౌమ్ బౌండ్ లో కావాల్సినన్ని ఉన్నాయని పేర్కొన్నారు హసన్.