
హైదరాబాద్ లో బీసీ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బహుజనుల (బీసీ) బతకమ్మ నిర్వహిస్తామని ప్రకటించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు బీసీ మహిళల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి ఆధ్వర్యంలోవాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ప్రధాన డిమాండ్ తో హైదరాబాదులోని సచివాలయం వద్ద వేలాది మంది మహిళలతో బీసీ బతకమ్మను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బీసీలకు విద్యా , ఉద్యోగ రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని గత 22 నెలలుగా బీసీలు పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దిగి రావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దనే పెండింగ్ లో ఉందని , అసెంబ్లీలో చట్టం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు . బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి మాట్లాడుతూ పూలను పూజించే బతుకమ్మ అని, బీసీలకు బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ అని అలాంటి పండుగ ను తెలంగాణలో ఎంతో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడం చాలా అభినంద నీయమన్నారు. ఈ బతుకమ్మ వేదికగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు మహిళాల సబ్ కోట కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘాల నేతలు తారకేశ్వరి, సమతా యాదవ్, సంధ్య, సుజాత, శ్యామల, గౌతమి, మీణదేవి, రాజేశ్వరి, ,శైలజ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.