
కీలకమైన పోస్టులో కొలువు తీరింది
ముంబై : దేశంలో పేరు పొందిన రిలయన్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిలయన్స్ గ్రూప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య కంపెనీ బ్రాండ్ ఉనికిని మరింత బలోపేతం చేయడంలో తను కీలకంగా వ్యవహరిస్తుందని కంపెనీ పేర్కొంది. కావేరీ నాగ్ వ్యాపారాత్మక నిర్వహణలో కీలకమైన రోల్ పోషించారు గత కొన్ని సంవత్సరాలుగా. తను రిటైల్ , లగ్జరీ ఆటోమోటివ్ , ప్రకటన రంగాలలో 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఇందులో ఎంపిక కాక ముందు కావేరి నాగ్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ ఇండియాతో మూడు సంవత్సరాలకు పైగా సంబంధం కలిగి ఉన్నారు. అక్కడ ఆమె చివరిగా మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ హెడ్‌గా పని చేశారు.
తన కెరీర్ మొత్తంగా చూస్తే, కావేరి నాగ్ డైనమిక్ మార్కెటింగ్ లీడర్‌గా గుర్తింపు పొందారు. డిజిటల్ పరివర్తన, వ్యాపార వృద్ధి రెండింటినీ సమ్మిళతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించారు. తన నైపుణ్యం వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, స్టేక్‌హోల్డర్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్లానింగ్, డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ మార్కెటింగ్, వార్షిక మార్కెటింగ్ ప్లానింగ్ , సీఆర్ఎం ఎంగేజ్మెంట్ స్ట్రాటజీలను విస్తరించడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ రిటైల్ కంపెనీ తనకు మంచి పదవిని అప్పగించింది.
కావేరీ నాగ్ నియామకంతో రిలయన్స్ రిటైల్ తన మార్కెటింగ్ వ్యూహాలను మరింత మెరుగు పరుచుకుంటుందని, వినియోగదారుల సంబంధాన్ని బలోపేతం చేస్తుందని కంపెనీ నమ్ముతోంది. అంతే కాదు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ రంగంలో తన బ్రాండ్ ను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని భావిస్తోంది.