
62 బంతులు 17 ఫోర్లు 5 సిక్సర్లు 125 పరుగులు
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డే లో రికార్డుల మోత మోగింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఏకంగా భారత మహిళా జట్టు ముందు 413 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇండియా జట్టు తడపడింది. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతీ మందన్నా రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో వన్డే పరంగా ఉన్న రికార్డ్ ను దాటేసింది. తను కేవలం 63 బంతులు మాత్రమే ఎదుర్కొంది. 17 ఫోర్లు 5 సిక్సర్లతో 125 రన్స్ చేసింది. గతంలో తనపై ఉన్న 70 బంతుల్లో చేసిన శతకాన్ని దాటేసింది. కేవలం 51 బాల్స్ లోనే సూపర్ సెంచరీ సాధించింది. స్మృతీ మందన్నా అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ భారత జట్టు ఓటమి పాలైంది.
గతంలో వన్డే ఫార్మాట్ లో 52 బంతుల్లో సూపర్ ఫాస్ట్ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసింది ముంబైకి చెందిన స్టార్ క్రికెటర్ స్మృతీ మందన్నా. ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం తను మాట్లాడారు. ఈ సిరీస్ రాబోయే ప్రపంచ కప్ కంటే తన జట్టు కాంబినేషన్లు, బలహీనతలను పరీక్షించడమేనని అన్నారు. ఆస్ట్రేలియా అద్భుతమైన, బలమైన జట్టు అని పేర్కొన్నారు. ప్రధానంగా తమ జట్టును ఆందోళన కలిగిస్తున్నది మాత్రం ఫీల్డిండేనని చెప్పింది మందన్నా. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో అద్భుతంగా ఆడామన్నారు. మూడు వన్డే మ్యాచ్ లలో కీలకమైన 12 క్యాచ్ లను వదిలి వేయడం జరిగిందన్నారు. వ్యక్తిగత ప్రతిభ కాకుండా ఒక యూనిట్‌గా కలిసి ఫీల్డింగ్ పరంగా జట్టులో స్థిరత్వాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు.