క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై పోటెత్తిన భ‌క్తులు

విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ క‌న‌క‌దుర్గ అమ్మ వారి ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగరంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాల‌య క‌మిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్స‌వాలు 11 రోజుల పాటు కొన‌సాగనున్నాయి. ఉత్స‌వాల‌లో ఇది రెండో రోజు. క‌న‌క‌దుర్గ‌మ్మ ఇవాళ గాయ‌త్రిదేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తోంది. మంగ‌ళ‌వారం ఏపీకి చెందిన హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . స‌విత‌, జి. సంధ్యా రాణి, ప్ర‌శాంతి, గ‌ల్లా మాధ‌వి, శిరీషా దేవి, సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిన అనంత‌రం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ వారిని వేడుకోవడం జరిగింద‌న్నారు ఈ సంద‌ర్బంగా హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. దాదాపు 20 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకుంటార‌ని తాము అంచ‌నా వేశామ‌న్నారు . ఏ ఒక్క‌రికీ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తాను భ‌క్తుల‌తో కూడా ఏర్పాట్ల‌పై ఆరా తీశామ‌న్నారు. వారంతా సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని అమ్మ వారిని ప్రార్థించిన‌ట్లు చెప్పారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *