తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం

రావాల‌ని కోరిన సీఈవో సాయి గుండ‌వెల్లి

హైద‌రాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రాన్ని స్వ‌యంగా అంద‌జేశారు సంస్థ సిఇఓ సాయి గుండ‌వెల్లి. ఇదిలా ఉండ‌గా వాస్త‌వానికి ఈనెల 24న బుధ‌వారం న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగే గ్రీన్ ఫీల్డ్ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కాలేక పోయారు. ఈ విష‌యాన్ని మంగళ‌వారం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కడం విశేషం. తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు సీఈవో.

ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ సాయి గుండవెల్లి వెంట ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చే నెల అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు , మార్పు తీసుకొచ్చే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్‌కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.

తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *