ఆర్డీటీ సంస్థ‌కు అండ‌గా ఉంటాం : లోకేష్

ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవ‌ల్ చేసేందుకు కృషి చేస్తాం

అమ‌రావ‌తి : ఆర్డీటీ సంస్థ‌కు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ స‌మావేశం సంద‌ర్బంగా మంత్రి ఎస్ . స‌విత ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు త‌న‌తో భేటీ అయ్యారు. ఉమ్మ‌డి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి త‌న‌తో భేటీ అయ్యారు. ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ను కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. రాయలసీమ అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కీలకమని, ఆ సంస్థ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరణ గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.

ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సానా సతీశ్ కు అప్పగించినట్లు లోకేశ్ ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులోనైనా ఆర్టీసీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ సాధించి తీరుతామని వారికి హామీ ఇచ్చారు. ఆరు నెలల నుంచి ఆర్డీటీ ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ పునరుద్ధరణకు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్డీటీపై వైసీపీ హడావుడి సృష్టి చేస్తోందని మంత్రి సవిత విమర్శించారు. దీనిని రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తోందంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆరు నూరైనా స‌రే ఎఫ్సీఆర్ఏ రెన్యూవ‌ల్ ను పున‌రుద్ద‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు.

  • Related Posts

    నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు.…

    బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *