
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
తిరుపతి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని ఆచరణలో అదంతా అబద్దమన్నారు. బుధవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఎంతో నష్టం జరిగిందన్నారు. దీనిని పూడ్చేందుకు ఎవరూ ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత తాము సంతోషంగా లేమన్నారు చింతా మోహన్. తూర్పు కి సముద్ర పడమట రాళ్ళు నేటికి సచివాలయాలనికి రాలేదన్నారు.
కేంద్రం ఏదీ లేదన్నారు. ప్రస్తుతం సాయం కోసం ఆంద్రప్రదేశ్ కన్నీరు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. ఆయన నిర్వాకం వల్ల ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు. అన్నీ అమ్మకానికి సిద్దంగా ఉంచారని, అత్యవసరం గా ఎందుకు హైదరాబాద్ వదిలి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. చేతకాని EVM లు ఓటు చోరి కి కారణం అని మండిపడ్డారు. ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.