ఐసీసీసీతో అన్ని ఆల‌యాల‌ను అనుసంధానం చేయాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల‌లో గురువారం నూత‌నంగా నిర్మించిన ఏపీసీ 5 భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సిస్ట‌మ్ ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది భ‌క్తులు వ‌చ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమ‌ల‌లో గోవింద నామం త‌ప్పా ఇత‌రవేవీ వినిపించ కూడ‌ద‌న్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత ప‌విత్ర‌మైన క్షేత్ర‌మ‌ని , శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కృప వ‌ల్ల‌నే ఇవాళ తాను బ‌తికి బ‌య‌ట ప‌డ్డాన‌ని చెప్పారు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్ల‌నే ముఖ్య‌మంత్రి మరోసారి కొలువు తీరాన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హెఆర్డీ అండ్ ఐటీ మంత్రి నారా లోకేష్, రెవిన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివీఎస్వో మురళీకృష్ణ, టిటిడి బోర్డు సభ్యులు, సీఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *