బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటే తాట‌తీస్తాం

నిప్పులు చెరిగిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంచ‌డం ప‌ట్ల స్పందించారు. ఈ మేర‌కు 42 శాతం పెంంపును అడ్డుకోవాల‌ని ఎవ‌రైనా ప్ర‌య‌త్నం చేస్తే తాట తీస్తామ‌ని, వారి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని తీవ్రంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. శ‌నివారం ఆయ‌న అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని దయచేసి ఎవరు ప్రయత్నించ వద్దని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపున‌కు అసెంబ్లీలో అన్ని పార్టీలు సహకరించిన విధంగానే ఇప్పుడు కూడా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు న్యాయబద్ధంగా జనాభా తమాషా ప్రకారం 60 శాతం రిజర్వేషన్లు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కానీ 18 శాతం రిజర్వేషన్లు బీసీలు కోల్పోతూ 42 శాతానికి పరిమితమైన విషయాన్ని రిజర్వేషన్ వ్యతిరేకులు గుర్తించు కోవాలని ఆయన కోరారు . బీసీల జనాభా దామాషా కంటే ఒక శాతం ఎక్కువ ఉన్నా ఎవరైనా అడ్డుకోవచ్చని జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ సూచించారు. బీసీ జనాభా కు తక్కువగా రిజర్వేషన్లు అమలు జరుగుతుంటే అడ్డుకోవాలని చూడడం వారి బీసీ వ్యతిరేక భావానికి నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకున్నా బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని స్ప‌ష్టం చేశారు జాజుల‌. వారిని రాజకీయంగా భూస్థాపితం చేసి వారిని భరతం పట్టే వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని బీసీల జ‌పం చేస్తూ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

  • Related Posts

    రేపే సీఎం చంద్ర‌బాబు పుట్ట‌ప‌ర్తికి రాక‌

    22,23వ తేదీల‌లో ముఖ్య‌మంత్రి టూర్ అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పుట్ట‌ప‌ర్తిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 22, 23 తేదీల‌లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు…

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *