
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా. తను స్వంతంగా బతుకమ్మను నెత్తిన పెట్టుకుని పాల్గొన్నారు. అనంతరం పూజలు చేసి నమస్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించడం, ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు రేఖా గుప్తా. ఇందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని, అంతకు మించిన సంతోషాన్ని మిగిల్చిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతపు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని ప్రశంసలు కురిపించారు.
రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వైరైనా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మను కొలుస్తున్నారని ప్రతి ఆడబిడ్డ ఇందులో తమ వంతుగా పాల్గొంటుడడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు రేఖా గుప్తా. తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో, ఉద్యమంలో బతుకమ్మ కీలకమైన పాత్ర పోషించింది. తమ న్యాయపరమైన డిమాండ్ ను బతుకమ్మ సాంస్కృతిక నేపథ్యంలో సపోర్ట్ గా నిలిచింది బతుకమ్మ.