
ఆసియా కప్ విజేతకు రూ. 21 కోట్లు
దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టీం ఇండియా 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా అద్భుత విజయాన్ని సాధించిన సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రులు ఎ. రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కంగ్రాట్స్ తెలియ చేశారు. ఈ విజయం దేశానికి గర్వ కారణంగా నిలిచిందన్నారు. ఈ సందర్బంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది.
సోమవారం ఈ మేరకు అధికారికంగా భారత జట్టుకు ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు ఆసియా కప్ ను కైవసం చేసుకుని , విజేతగా నిలిచినందుకు బీసీసీఐ అధ్యక్షుడు సున్హాస్ తో పాటు కొత్త కార్యవర్గం అభినందనలు తెలిపింది. జట్టు, మేనేజ్మెంట్ కు ఏకంగా భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ. 21 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు వెల్లడించింది. దేశం గర్వించేలా టీమిండియా ఆడిందని, ఇదే స్పూర్తితో రాబోయే మ్యాచ్ లలో ప్రదర్శించాలని కోరింది. మరో వైపు భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశాడు. తను ఆడిన మ్యాచ్ లకు సంబంధించి ఇచ్చే ఫీజుల పరంగా వచ్చే డబ్బులను భారత దేశ సైన్యం కోసం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు.