భార‌త సైన్యం కోసం సూర్య భారీ విరాళం

దుబాయ్ వేదిక‌గా ప్ర‌క‌టించిన కెప్టెన్

దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ తో. ఈ కీల‌క పోరులో టీం ఇండియా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. దాయాది జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌ను ఆడ‌కుండానే చేతులెత్తేసింది. ఆ జ‌ట్టు 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన భార‌త జ‌ట్టు కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 150 ర‌న్స్ చేసింది. ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో పెహ‌ల్గామ్ లో టూరిస్టులు 26 మందిని కాల్చి చంపారు. దీ

నికి నివాళిగా భార‌త జ‌ట్టు పాకిస్తాన్ తో క‌ర‌చాల‌నం చేయ‌లేదు. అంతే కాదు ఆసియా క‌ప్ ను తీసుకునేందుకు కూడా నిరాక‌రించింది టీమ్ ఇండియా. ఆసియా క‌ప్ ను గెలుపొందిన అనంత‌రం భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ మేర‌కు తాను టోర్నీలో ఆడియ‌న ప్ర‌తి మ్యాచ్ సంద‌ర్బంగా ఫీజుల ద్వారా ఇచ్చే డ‌బ్బుల‌ను పూర్తిగా భార‌త దేశ ర‌క్ష‌ణ కోసం నిమ‌గ్న‌మైన ఆర్మీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌ను చేసిన ప్ర‌క‌ట‌న‌కు క్రీడాలోకంతో పాటు అభిమానులు సైతం సూర్యా భాయ్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌ను తీసుకున్న నిర్ణ‌యం తోటి క్రీడాకారుల‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌ని పేర్కొంటున్నారు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *