బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి

హైడ్రా క‌మిష‌న‌ర్‌కు హ‌నుమంత‌రావు విన‌తి

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌తుక‌మ్మ కుంట‌ను అభివృద్ది చేయ‌డంలో, పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు అభినందించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న చేశారు క‌మిష‌న‌ర్ ను. ఇక నుంచి బ‌తుక‌మ్మ కుంట సంర‌క్ష‌ణ‌ను చూడాల‌ని కోరారు. బ‌తుక‌మ్మ‌కుంట‌ను బాగా అభివృద్ధి చేశార‌ని, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దార‌ని, దీంతో ఈ ప్రాంత రూపురేఖ‌లు మారి పోయాయని అన్నారు.. బ‌తుక‌మ్మ కుంట నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కూడా హైడ్రా తీసుకోవాలని కోరారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారిని క‌లిసి ఈ మేర‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. క‌బ్జాల చెర నుంచి బ‌తుక‌మ్మ కుంట‌ను కాపాడ‌డం, చెరువుగా అభివృద్ధి చేయ‌డం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌డం ఇలా అన్ని కార్య‌క్ర‌మాలు ఎంతో వైభ‌వంగా జ‌రిగాయ‌ని ప్ర‌శంసించారు.

ఈ విష‌యంలో హైడ్రా చేసిన కృషి అభినంద‌నీయ‌మ‌ని వీహెచ్ అన్నారు. బ‌తుక‌మ్మ‌కుంట‌ను అభివృద్ధి చేసి వ‌దిలేశారు అనే అప‌వాదు రాకుండా దీని ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త‌ను హైడ్రా తీసుకోవాల‌ని విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు. లేని ప‌క్షంలో ఇక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం దెబ్బ తింటుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ‌తుక‌మ్మ‌కుంట ఇప్పుడు ప‌ర్యాట‌క ప్రాంతంగా మారింద‌ని అన్నారు. ప్రారంభోత్స‌వం నాటి నుంచి నేటి వ‌ర‌కూ అక్క‌డ ప్ర‌తి రోజు సాయంత్రం సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కుంటోంద‌న్నారు. వంద‌లాది మంది వ‌చ్చి బ‌తుక‌మ్మ ఆడార‌న్నారు. వ‌చ్చే ఏడాది మ‌రింత వైభ‌వంగా బ‌తుక‌మ్మ ఆట‌లు ఆడుతార‌ని ఈ నేప‌థ్యంలో చెరువు అందాలు ఏమాత్రం దెబ్బ‌తిన‌కుండా చూడాల‌ని కోరారు. ప్ర‌స్తుతం బ‌తుక‌మ్మ‌కుంట‌లో ఉన్న బోటు షికారును కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *