
వచ్చే ఏడాది 2026లో ఘణంగా వివాహం
హైదరాబాద్ : యువ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తీపి కబురు చెప్పారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇరు కుటుంబాల సమక్షంలో దండలు మార్చుకున్నారు. నిశ్చితార్థం పూర్తయిందని వెల్లడించారు. ఈ ఇద్దరికి సంబంధించి పెద్ద ఎత్తున గత కొంత కాలం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. తామిద్దరం ప్రేమలో పడ్డామని, డేటింగ్ లో ఉన్నామని చెప్పకనే చెప్పారు. చాలా చోట్ల కెమెరా కళ్లకు కనిపించారు. కొంత కాలం పాటు వీరు కొన్ని బహిరంగ ప్రదేశాలలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపంచారు. ఆపై అభిమానులకు కనువిందు చేశారు. ఈ సమయంలో డేటింగ్ పై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ బయట పెట్టలేదు. కానీ ఉన్నట్టుండి ఎవరూ ఊహించని రీతిలో ఈ ఇద్దరు ఒక్కటి కావడం విశేషం.
ఈ ఇద్దరి పెళ్లి కూడా కన్ ఫర్మ్ చేసేశారు కుటుంబీకులు. వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి నెలాఖరులో గ్రాండ్ గా పెళ్లి చేస్తామని తెలిపారు. ఇక కెరీర్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కలిసి తొలుత డియర్ కామ్రేడ్ , తర్వాత గీత గోవిందం సినిమాలో నటించారు. గీత గోవిందం సూపర్ బంపర్ హిట్ గా నిలిచింది. ఆనాటి నుంచే ఈ ఇద్దరు లవ్ లో ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఇండియాలో నేషనల్ క్రష్ గా ఉంది రష్మిక మందన్నా. తను టాప్ లో ఉండగా విజయ్ దేవరకొండ ఇంకా సినిమాలలో బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తను భాగ్యశ్రీ బోర్సేతో కలిసి చేసిన మూవీ ఆశించిన మేర ఆడడంతో బయట పడ్డాడు. మొత్తంగా ఒక్కటి కావడం విశేషం.