
శ్రేయాస్ అయ్యర్ కు బీసీసీఐ బిగ్ షాక్
ముంబై : బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ కు ప్రమోషన్ ఇచ్చారు. తనను ఇప్పటికే టి20 ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఉన్నట్టుండి వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమించారు. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ ను స్కిప్పర్ గా చేస్తారని అనుకున్నారు అంతా. కానీ బిగ్ షాక్ ఇచ్చింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రమేయం లేకుండానే చైర్మన్ ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. మరో వైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను తాజాగా ప్రకటించిన వన్డే జట్టులో చేర్చారు. ఇక అయ్యర్ కు ఉప నాయకుడిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇందులో భాగంగా 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మేరకు సీనియర్ పురుషుల జట్లను వేర్వేరుగా ప్రకటించింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వీసీ), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వీసీ), యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసింది. ఇక టి20 జట్టు కోసం సూర్య కుమార్ యాదవ్ కు నాయకత్వ బాధ్యతలు అప్పించింది. తన సారథ్యంలో ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ , వాషింగ్టన్ సుందర్ ను ఖరారు చేసింది.