
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఆనం, అనిత
విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తుల కోరికలను తీర్చే అమ్మ శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. వేలాదిగా భక్తులు బారులు తీరారు. ఉత్సవం సందర్బంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సర్కార్ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, గోవా రాష్ట్ర గవర్నర్ అశోక గజపతి రాజుకు ఘనంగా స్వాగతం పలికారు.
తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. అందరినోటా జై పైడితల్లి, జైజై పైడిమాంబ నామస్మరణే. ఆ అపురూప ఘట్టం చూసిన కనులదే భాగ్యం. తరించిన భక్తకోటి పుణ్యఫలం. తల్లి దర్శనం అమోఘం, నయనానందకరం. అమ్మరూపం దేదీప్యమానం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఘట్టం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో నెల రోజులపాటు విజయనగరమంతా ఆధ్యాత్మికత ఉట్టి పడేలా సాగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తజనం లక్షలాదిగా తరలి వచ్చారు.
సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం, బెస్తవారివల ముందు నడవగా, భక్తుల జయజయ ద్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు.