
లాయర్ రాకేశ్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది సీజేఐ గవాయ్ పై షూ విసిరిన ఘటన. ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖండించారు. ఈ ఘటన సీజేఐపై జరిగిన దాడి మాత్రమే కాదు యావత్ ప్రజాస్వామ్యం ఆత్మపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఓ వైపు దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండగా మరో వైపు దాడికి పాల్పడిన లాయర్ రాకేశ్ కిషోర్ స్పందించారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు మంగళవారం. ఈ సందర్బంగా మరోసారి తన దాడిని సమర్థించుకున్నారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సీజేఐ విష్ణువుపై చేసిన కామెంట్స్ తనను బాధ కలిగించాయని అన్నారు.
ఒకవేళ మీరు ఉపశమనం కలిగించ కూడదనుకుంటే కనీసం దానిని ఎగతాళి చేయకండి. పిటిషన్ కొట్టి వేయబడటం అన్యాయం. అయితే తాను హింసకు వ్యతిరేకం. కానీ ఏ సమూహంతోనూ సంబంధం లేని సామాన్యుడు అలాంటి చర్య ఎందుకు తీసుకున్నాడో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు రాకేశ్ కిషోర్. తాను చేసింది తప్పు అని భావించడం లేదన్నారు. ఇతరుల మనోభావాల గురించి కించ పరిచే లా మాట్లాడటం ఏ రాజ్యాంగం అవకాశం ఇవ్వదన్నారు. తాను కూడా రాజ్యాంగాన్ని చదువుకున్నానని అన్నారు . అంతే కాదు భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ పదవి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. CJI రాజ్యాంగ స్తంభంపై కూర్చుని ‘నా ప్రభువు’ అని పిలుస్తారు, కాబట్టి ఆయన దాని అర్థాన్ని అర్థం చేసుకుని గౌరవాన్ని కాపాడు కోవాలన్నారు.