ఎవరికీ మద్దతు ఇవ్వ కూడదని నిర్ణయం
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కూడా ఆదేశించారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరిగా మారింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ స్థానం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో జరిగిన ఎన్నికల్లో నగరంలో గులాబీ పార్టీకి భారీ మెజారిటీ దక్కింది. కానీ గ్రామీణ ప్రాంతాలలో పట్టును కోల్పోయింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా సరే పాగా వేయాలని అనుకుంటోంది. అభ్యర్థిని ప్రకటించడంపై ఫోకస్ పెట్టింది పార్టీ. ఇప్పటికే పలువురిని ఇంచార్జిగా నియమించింది. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిని నియమించారు. తాను స్టార్ క్యాంపెయినర్ గా ఉండనున్నారు. ఇక స్థానం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక ప్రకటన చేసింది. చని పోయిన ఎమ్మెల్యే భార్యకు ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ జూబ్లీ హిల్స్ లో ఆంధ్రులు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ ఎందుకనో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కీలక సమావేశం నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరని పేర్కొన్నారు.






