సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్
ముంబై : ప్రముఖ భారతీయ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత పరుగుల కంటే భారత దేశం కోసం ఆడటాన్ని ఎక్కువగా ఇష్ట పడతానని అన్నాడు. అంతే కాదు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు. తను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రికెట్ లోకి అడుగు పెట్టానని చెప్పాడు. ముంబై వేదికగా జరిగిన సియట్ టి20 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సియట్ టి20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యడు ఈ కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తన కెరీర్ పరంగా ఎత్తు పళ్లాలు ఉన్నాయి. ఓపెనర్ గా ప్రమోట్ చేశాక 12 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 37.90 సగటుతో 183.70 స్ట్రైక్ రేట్ తో మొత్తం 417 పరుగులు చేశాడు. అందరి క్రికెటర్ ల కంటే ముందంజలో ఉన్నాడు.
ఈ సందర్బంగా ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు ఇప్పుడు భారత టి20 ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం సంజూ శాంసన్ ప్రసంగించాడు. ఈ అవార్డును తన భార్య చారుకి అంకితం చేస్తున్నానని తెలిపాడు. తను కూడా నాతో పాటే ప్రయాణం చేస్తోందన్నాడు. 10 ఏళ్లవుతోంది నేను క్రికెట్ ఆటలోకి వచ్చింది. 5 టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ల వ్యవధిలో మూడు మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించడం ఆనందంగా ఉందన్నాడు. భారత దేశం తరపున ఆడడం, జెర్సీ ధరించడం కంటే గొప్ప విషయం ఏం ఉంటుందని ప్రశ్నించాడు శాంసన్.








