ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ఓ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆమేరకు మూడు ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నామని అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకూ ఒక ఆర్ధిక ప్రగతి రీజియన్‌ను , నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.

ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి అవుతున్నాయని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. వీటితో పాటు ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉన్న రాయలసీమ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్‌గా మారుతోందన్నారు. అమరావతి రాజధాని నగరం క్వాంటం వ్యాలీతో నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా మారుతుందని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును కూడా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని, దీని కోసం ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసుకుని ప్రాజెక్టులను ఆహ్వానించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వే లైన్‌కు కూడా అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గి ఆయా ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపుపైనా దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పర్యాటకులకు నాణ్యమైన వసతి లభించేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ కేటగిరీల హోటళ్లకు అనుబంధంగా ఎకో సిస్టం కూడా వచ్చేలా చూడాలని సూచించారు. తిరుపతిలో ఉన్న కలినరీ ఇనిస్టిట్యూట్‌ను డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచి వివిధ సంస్థలను అనుసంధానించాలని పేర్కొన్నారు. కూచిపూడి, థింసా లాంటి సంప్రదాయాలతో పాటు వివిధ ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు. ఇటీవల విజయం సాధించిన విజయవాడ ఉత్సవ్ తరహాలోనే విశాఖ, రాజ మహేంద్రవరం లాంటి చోట్ల కూడా ఉత్సవ్‌లను నిర్వహించాలని సూచించారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *