మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాలి

పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

విశాఖ‌ప‌ట్నం : స‌మాజంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న మ‌హిళ‌లు త‌లుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) విజయవాడ చాప్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అనిత‌. మహిళలను వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మార్చే వేదికపై ప్రసంగించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. గ్రామీణ కళాకారుల నుంచి డిజిటల్ నూతన ఆవిష్కరణల వరకు ప్రోత్సాహం ఇస్తూ మహిళలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

ముఖాముఖిలో మహిళల రక్షణ, సైబర్ బులీయింగ్ పై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. FICCI మరియు స్థానిక మహిళా సంఘాల సహకారంతో మహిళల రక్షణ చర్యలు పెంచుతామని స్ప‌ష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. 24 గంటలు పనిచేసేలా హెల్ప్ లైన్ తో పాటు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ఆన్ లైన్ వేదికలను మహిళలకు సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను మ‌హ‌రాణులుగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు, కుక్కర్లు అందచేశారు మంత్రి. వ్యాపార‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *