జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం
యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజారులు , ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఈవో ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి. రామకృష్ణా రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శన ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జి. రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం, స్మారక ఫోటోలను న్యాయ మూర్తులకు అందజేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీజే అపరేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రాన్ని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి కృప ప్రతి ఒక్కరి పై ఉండాలని తాను కోరుకున్నానని తెలిపారు. ఆయనతో పాటు వచ్చిన న్యాయమూర్తులు సైతం ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారంటూ కితాబు ఇచ్చారు. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహుడు కొలువు తీరి ఉండడం మహత్ భాగ్యమని పేర్కొన్నారు.







