నిప్పులు చెరిగిన వైస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయన 2014లో దేశంలో ప్రధానమంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా దేశంలోనే అత్యంత శక్తివంతమైన చట్టం సమాచార హక్కు చట్టాన్ని నిట్ట నిలువునా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆదివారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ చట్టం తమ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు 2005వ సవంత్సరంలో అమలు లోకి తీసుకు వచ్చారన్నారు. ఆర్టీఐ చట్టంగా ఏర్పడి 20 ఏళ్లు అవుతోందన్నారు. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీని, ఆయన కక్ష కట్టిన తీరును తీవ్రంగా ఎండగట్టారు. 2024 నాటికి దేశంలో ఉన్న 29 కమిషన్లలో పౌరులు పెట్టుకున్న 4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే RTI ని ఎలా బంధించారో అర్థం అవుతుందన్నారు.
ఆర్టీఐ 20వ వార్షికోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2019 సవరణలను వెంటనే రద్దు చేయాలని, కమిషన్ సభ్యుల పదవి కాలాన్ని 5 ఏళ్లుగా మళ్ళీ నిర్ణయించాలన్నారు షర్మిలా రెడ్డి. సమాచార కమిషనర్లు స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా పనిచేసే స్వేచ్ఛను పునరుద్ధరించాలని కోరారు. కమిషన్ లో ఇద్దరు కాదు పూర్తి స్థాయిలో 11 మంది కమిషనర్ల నియామకం జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విజిల్ బ్లోయర్ల ప్రొటెక్షన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. వారికి రక్షణ కల్పించాలని అన్నారు షర్మిలా రెడ్డి. జర్నలిస్టులు, మహిళలు, విద్యావేత్తలతో పాటు కమిషన్ లో అన్నివర్గాల ప్రతినిధులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు.






