పోలీసుల క్రీడా పోటీల నిర్వ‌హ‌ణ‌ భేష్ : అనిత

పోటీల‌ను ప్రారంభించిన హొం మంత్రి

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ‌వారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు మంత్రి అనిత వంల‌పూడి. పోటీల్లో పాల్గొంటున్న జట్లు మార్చ్ ఫాస్ట్ ను వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. నేటి నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి ఈ పోటీలు. ఈ పోటీల‌లో పోలీస్ శాఖ నుంచి పురుషులు, మహిళల విభాగాల్లో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పోలీస్ సంస్థల నుంచి 32 జట్లు పాల్గొంటున్నాయి.

ఈ సంద‌ర్బంగా హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌సంగించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. ఏపీని క్రీడ‌ల‌కు హ‌బ్ గా మారుస్తామ‌ని చెప్పారు. కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి. రాజ‌ధాని అమ‌రావ‌తిలో 15 ఎక‌రాల స్థ‌లంలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. పోలీసులు విధుల‌ను నిర్వ‌హిస్తూనే క్రీడ‌ల‌లో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రేయింబ‌వ‌ళ్లు లా అండ్ ఆర్డ‌ర్ కోసం క‌ష్ట ప‌డుతున్న తీరు త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *