మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది మంచో ఏది చెడో బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలని అన్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని ఆరోపించారు. బుధవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు హరీశ్ రావు సమక్షంలో. ఈ సందర్బంగా ప్రసంగించారు . రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అని, మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది ఏమిటి? హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణా అని నిలదీశారు. బడా బాబుల , ఆక్రమణదారుల భవనాలు ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు హరీశ్ రావు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్లలోనే ఉందని, మరి దాని జోలికి ఎందుకు హైడ్రా వెళ్ల లేదన్నారు హరీశ్ రావు. అంతే కాదు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కూడా బఫర్ జోన్ లో నే ఉందని మరి దానిని ఎందుకు కూల్చ లేదన్నారు. ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. పండుగ పూట ఆదివారం నాడు రాత్రి వచ్చి గరీబోళ్ల ఇల్లు కూలగొట్టి వేల కుటుంబాలను రోడ్డు మీదికి తెచ్చిండు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.






