‘కందుల’ ప‌ర్యాట‌క ప్రాంతాల సంద‌ర్శ‌న

రాజ‌స్థాన్ లో ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి

రాజ‌స్థాన్ : ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజ‌స్థాన్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి షెకావ‌త్ ను క‌లిశారు. ఏపీకి ప‌లు ప‌ర్యాట‌క ప్రాజెక్టులు మంజూరు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు త‌ను ఓకే చెప్పార‌ని తెలిపారు. ఉదయపూర్ లో జరిగిన జాతీయ పర్యాటక మంత్రుల సమావేశంలో పాల్గొన‌డం జ‌రిగింద‌న్నారు. అనంతరం సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయ్‌పూర్ పర్యాటక ప్రాంతాలను సందర్శించాన‌ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ లేక్ పిచోలా, జగ్ నివాస్, జగ్ మందిర్, అలాగే చారిత్రక మాన్సూన్ ప్యాలెస్‌లను సంద‌ర్శించ‌డం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. స్థానిక అధికారులు, గైడ్స్ ద్వారా అక్కడి చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాధాన్యతల గురించి తెలుసు కోవ‌డం జ‌రిగింద‌న్నారు.

ఉదయ్‌పూర్ నిజంగా భారతదేశంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటి అని పేర్కొన్నారు. ప్రశాంత సరస్సులు, రాజ భవనాలు, కోటలు, ప్రకృతి సౌందర్యం కలగలిసి అద్భుతమైన పర్యాటక అనుభవాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి పర్యాటక అభివృద్ధి విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే రాష్ట్ర పర్యాటక రంగం మరింత ముందుకు వెళ్తుందని త‌న‌కు తోచింద‌న్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని ఆధునిక దిశగా అభివృద్ధి చేయడానికి త‌మ వంతుగా కృషి చేస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *