మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు

నివాళులు అర్పించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం

హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు మేఘా సంస్థ అధికారులు, సిబ్బంద ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎం ఈ ఐ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి మాతృమూర్తి పీ విజయలక్ష్మి ఈ నెల ఐదో తేదీన తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి సంస్మరణ కార్యక్రమం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. తొలుత భర్త పీ వీరారెడ్డి, కుమారులు ఎం ఈ ఐ ఎల్ ఎం డీ పీవీ కృష్ణా రెడ్డి, ఎం ఈ ఐ ఎల్ సీఈఓ పీవీ సుబ్బారెడ్డి, కుమార్తె ప్రసన్న, సోదరుడు , ఎం ఈ ఐ ఎల్ చైర్మన్ పీపీ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు హైటెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆర్ రఘురామ కృష్ణంరాజు, తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్ , ఎంపీలు సీఎం రమేష్,కే రఘువీర్ రెడ్డి, డి కె అరుణ, తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, ఎం ఎల్ ఏ లు టి హరీష్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ , సినీ నటులు కొణిదెల చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్, మాజీ ఎంపీ లు కేవీపీ రామచంద్ర రావు , ఏపీ జితేందర్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, తెలంగాణ హోమ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి సి వీ ఆనంద్, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, మై హోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు, వై ఎస్ ఆర్ సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి తదితర ప్రముఖులు విజయలక్ష్మికి నివాళులు అర్పించారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *