బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత దాకా పోరాటం

హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. సంబండ వ‌ర్ణాలు క‌లిసిక‌ట్టుగా ఈ బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో ఇది కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా క‌ళాకారులు నిర్వ‌హించిన ధూం ధాం ఆక‌ట్టుకుంది. ఆట పాట‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. ఇదిలా ఉండ‌గా ఈరోజు పల్లె నుండి పట్టణo వరకు సకలం బంద్ జరిగినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెల్లవారు జామున నాలుగు గంటల నుండి హైదరాబాదులోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద వందల మంది బీసీ శ్రేణులతో 12 గంటల పాటు ఆందోళన నిర్వహించారు.

ఆందోళన సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ కళాకారుల ఉద్యమ గీతాలతో ఆటపాటలతో ధూమ్ దాం ను నిర్వహించారు దీనితో బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు కళాకారుల ఆటపాటలతో బీసీ ఉద్యమకారుల నినాదాలతో దద్దరిల్లి పోయింది . తాము అనుకున్న దాని కంటే రాష్ట్ర బంద్ చారిత్రాత్మకంగా విజయవంతం జరిగిందని అన్నారు శ్రీ‌నివాస్ గౌడ్. ఈ బంధు ద్వారనైనా బీసీ రిజర్వేషన్ల కు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు .

తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, అవసరమైతే బీసీ రిజర్వేషన్లు ఆమోదించే వరకు ప్రధాని, రాష్ట్రపతి భవన్ వద్ద సీఎం ధర్నా చేపట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తులు సహకారంతో ఈరోజు రాష్ట్ర బంద్ దిగ్విజయం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జేఏసీలో చర్చించి బీసీ రథయాత్రను అన్ని జిల్లాలో చేపట్టి హైదరాబాదులోని గ్రౌండ్ లో లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేద‌న్నారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడి పెంచాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనని అన్నారు. సిపిఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే బీసీలు తిరగ బడడం ఖాయమన్నారు.

ఈ ఆందోళన కార్యక్రమం లో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్ అనిల్, బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాం యాదవ్, లంబాడ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బర్ల మణిమంజరి సాగర్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావులకోల్ నరేష్ ప్రజాపతి, పానుగంటి విజయ్ గౌడ్, వరికుప్పల మధు, మాదేశి రాజేందర్, నరసింహ నాయక్, జగన్నాథం, మహిళా సంఘం నాయకురాలు తారకేశ్వరి సమత యాదవ్, శ్యామల, స్వర్ణ గౌడ్, గౌతమి, సంధ్యారాణి, విజయలక్ష్మి,గూడూరు భాస్కర్, జిల్లెల నరసింహ, వెంకటేష్ గౌడ్, ఇంద్రమ్ రజక, సత్యం గౌడ్, భారత్ గౌడ్, గుంటి మహేష్, నాగరాజ్ , మీనాదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *