హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు

త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించిన మంత్రి ఎస్ స‌విత‌

అమ‌రావ‌తి : వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌ను స్వంత బిడ్డ‌ల్లాగా చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యం అందించాల‌ని సూచించారు. మంత్రి త‌న క్యాంపు కార్యాల‌యంలో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ప‌నితీరుపై ఆరా తీశారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హాస్టళ్లలో విపత్కర పరిస్థితులు తలెత్తగానే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల‌న్నారు. అన్నపర్రు బీసీ హాస్టల్ వంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దన్నారు.

డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు రోజూ తమ పరిధిలో ఉన్న బీసీ హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను సందర్శించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. సందర్శించిన కో ఆర్డినేట్ ఫొటోలతో తనిఖీ నివేదికలను వాట్సాప్ గ్రూప్ లో పొందు పర్చాలన్నారు. హాస్టళ్ల నిర్వహణలో వార్డెన్లు, డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, కో ఆర్డినేటర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రావాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించు కోవాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులతో ప్రేమ పూర్వకంగా మెలుగుతూ, విద్యపై ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ కార్యదర్శి మాధవీలత, వివిధ జిల్లాలకు డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు, హాస్టల్ వార్డెన్లు కో ఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *