ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వార్నింగ్
అమరావతి : గౌడ కుల వృత్తిని కావాలని కించ పరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను గౌడ సంఘల నేతలు. బీసీలను ఎదగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ కు, ప్రజా ప్రతినిధులకు తగిన రీతిలో బుద్ది చెబుతామన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు మీలాగా ధన బలం లేక పోవచ్చు కానీ , తమ సామాజిక వర్గానికి చెందిన వారి బలం ఉందన్నారు. కల్లు అమ్మడం తమ కులవృత్తి అని, అలాగని వారిని అలాగే ఉండాలని కోరుకోవడం తగదని హెచ్చరించారు. తాము కూడా రాజ్యాధికారం దిశగా ఎదగ కూడదా అని ప్రశ్నించారు.
ఇది మా కుల వృత్తి అని, మీలా కబ్జాలు, దందాలు చేసి ఎదిగి రాలేదన్నారు. తమ కులం గురించి తక్కువ చేసి మాట్లాడిన నీ లాంటి వాళ్ళ కి రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టబోతున్నాం అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గౌడ సంఘాల నేతలు. కుల వృత్తి ద్వారానే ఎప్పటి నుండో ఇప్పటికీ కూడా కల్లు గీత కార్మికులు ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉన్నామని అన్నారు. కల్లు అమ్మడం అనేది ఆ మహా శివుడు తమ కులానికి అందించిన వరం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మార్గాన గంగాధర్ , జై గౌడ్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగరావ్ గౌడ్, జై గౌడ్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ గౌడ్, సుబ్రహ్మణ్యం గౌడ్, వెంకన్న గౌడ్, సూరయ్య గౌడ్ ,అంగర కిషోర్, మట్టా అనిల్ పాల్గొన్నారు.






