దీపావళి పండుగ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం
హైదరాబాద్ : రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొని క్రియా శీలకంగా పనిచేసిన 33 జిల్లాల బీసీ ఉద్యమ శ్రేణులకు, బీసీ కుల సంఘాల నేతలకు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ సంఘాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ బంద్ తోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరువాలని అన్నారు. ఇచ్చిన మాట కోసం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపునిచ్చారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఓయూ బీసీ విద్యార్థి సంఘం ఇంచార్జ్ బొల్లెపల్లి స్వామి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కేపీ మురళీకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కానకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిటి మల్లయ్య. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు గూడూరు భాస్కర్ మేరు, లింగం గౌడ్, నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు .






